telugu navyamedia
రాజకీయ

నేడు హైదరాబాద్ లో  ట్రాఫిక్ ఆంక్షలు

హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నగరంలో శోభాయాత్ర నిర్వహించనున్నారు. గౌలిగూడ రామ్‌ మందిర్‌ నుంచి తాడ్‌బండ్‌ హనుమాన్‌ టెంపుల్‌ వరకు జరిగే ఈ భారీ ఊరేగింపునకు  ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ వాహనచోదకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. . ఏ ప్రాంతంలో అయినా అత్యవసర వాహనాలు, అంబులెన్స్‌లకు కచ్చితంగా దారివదిలేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్‌ మళ్లింపులు విధిస్తున్న ప్రాంతాల్లో బారికేడ్లు, సైనేజెస్‌ ఏర్పాటు చేయాలన్నారు. వీటి వల్ల సామాన్య వాహనచోదకులకు ఎలాంటి ఇబ్బందులు రావని, ఊరేగింపునకు ఆటంకం ఉండదని ఆయన పేర్కొన్నారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో ఎత్తైన స్థంభాలపై ఏర్పాటు చేసిన, మెబైల్‌ వేరియబుల్‌ మెసేజ్‌ బోర్డుల ద్వారా వాహనచోదకులకు ఎప్పటికప్పుడు సమాచారం, సలహాలు, సూచనలు అందించాలన్నారు. ట్రాఫిక్‌ మళ్లింపులు, ఆయా మార్గాల్లో ఉన్న రద్దీని గూగుల్‌ మ్యాపుల్లోనూ కనిపించేలా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని ఆదేశించారు.
* అఫ్జల్‌గంజ్, ఎస్‌జె బ్రిడ్జి, శంకర్‌షేర్ హోటల్, ముక్తీయార్ గంజ్ నుంచి పుత్లీబౌలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను గౌలిగూడ చమాన్ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం మీదుగా సీబీఎస్ వైపు దారి మళ్లిస్తున్నారు.
* ఆంధ్రాబ్యాంక్, రంగ్‌మహల్ నుంచి గౌలిగూడ చమాన్ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ రూట్‌లోని వాహనాలను పుత్లీబౌలి క్రాస్ రోడ్స్ మీదుగా రంగ్‌మహల్ వైపు దారి మళ్లిస్తున్నారు.
* గౌలిగూడ రాంమందిర్ వద్ద ఊరేగింపు మొదలైన తర్వాత చాదర్‌ఘాట్ నుంచి పుత్లీబౌలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను రంగ్‌మహల్ వై జంక్షన్ నుంచి సీబీఎస్ వైపు దారి మళ్లిస్తారు.
* పుత్లీబౌలి నుంచి ఆంధ్రాబ్యాంక్ మీదుగా ఊరేగింపు వెళుతున్న సమయంలో జీపీఓ నుంచి కోఠీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఎంజే మార్కెట్ వైపు దారి మళ్లిస్తున్నారు.
* ఊరేగింపు కోఠి ఆంధ్రబ్యాంక్ జంక్షన్‌కు చేరుకున్న సమమయంలో చాదర్‌ఘాట్ నుంచి ఆంధ్రాబ్యాంకు వైపు వచ్చే ట్రాఫిక్‌ను, డీఎం అండ్ హెచ్‌ఎస్ జంక్షన్ వద్ద సుల్తాన్‌బజార్ క్రాస్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
* ఊరేగింపు కాచిగూడ చౌరస్తాకు వచ్చిన సమయంలో వేర్వేరు మార్గాల నుంచి కాచిగూడ చౌరస్తాకు వస్తున్న ట్రాఫిక్‌ను టూరిస్ట్ హొటల్ జంక్షన్ వద్ద నుంచి బడీచౌడీ వైపు మళ్లిస్తారు. 
* బర్కత్‌పురా చమాన్ నుంచి వైఎంసీఏ రూట్‌లో ట్రాఫిక్ అనుమతించరు, ఈ ట్రాఫిక్‌ను ఓల్డ్‌పోస్టాఫీస్ మీదుగా కాచిగూడ వైపు మళ్లిస్తారు.

Related posts