telugu navyamedia
culture Telangana trending

రంజాన్ ప్రార్థనలు.. ట్రాఫిక్ ఆంక్షలు…

traffic restriction on last friday of ramzan

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు రంజాన్‌ మాసం ఆఖరి శుక్రవారం ప్రార్థ్ధనల సందర్భంగా చార్మినార్‌ మక్కా మసీదు, సికింద్రాబాద్‌ జామా మసీదు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో వాహనాలను మళ్లించనున్నారు. శుక్రవారం ఉదయం మక్కా మసీదు, జామా మసీదుల వద్ద ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థనలు చేయనున్నారు. చార్మినార్‌ నుంచి మదీనా, చార్మినార్‌ నుంచి ముర్గీ చౌక్‌, చార్మినార్‌ నుంచి మొఘల్‌పురా కమాన్‌ వరకు , సికింద్రాబాద్‌ జామా ఏ మసీదు దగ్గర కూడా ప్రార్థనలు జరుగుతుండడంతో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు వాహనాలను మళ్లిస్తారు.

పోలీసులు ప్రార్థనలు జరుగుతున్న ప్రాంతాల్లోని అన్ని రోడ్లను మూసివేయడంతో పాటు ఆ వైపు వాహనాలను రాకపోకలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మదీనా జంక్షన్‌, హిమ్మత్‌పురా, చౌక్‌ మైదాన్‌ ఖాన్‌, మోతిగల్లీ, ఏత్‌బార్‌ చౌక్‌, షేరే బాతిల్‌ కమాన్‌, లక్కడ్‌ కోటే జంక్షన్ల వద్ద వాహనాలను మళ్లిస్తారు. ఈ ప్రార్థనలకు వచ్చే వారికి కూడా పోలీసులు ప్రత్యేకంగా పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశారు. చార్మినార్‌ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను అఫ్జల్‌గంజ్‌ వరకే అనుమతిస్తారు. ఇమ్లిబన్‌ నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే బస్సులను నల్గొండ ఎక్స్‌ రోడ్డు, చంచల్‌గూడ జంక్షన్‌, సైదాబాద్‌ టీ జంక్షన్‌, ఐఎస్‌ సదన్‌, డీఎంఆర్‌ఎల్‌ జంక్షన్‌, మిధాని జంక్షన్‌, ఎమ్‌బీఎన్‌ఆర్‌ ైఫ్లైఓవర్‌, బండ్లగూడ , అరాంఘర్‌ మీదుగా మళ్లిస్తారు. ఈ మళ్లింపులను దృష్టిలో పెట్టుకొని వాహనదారులు ప్రత్యమ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

Related posts

భారత్ ఆర్థిక శక్తిగా ఎదగటానికి.. అమెరికా సాయం అవసరం.. : నిర్మలా సీతారామన్

vimala p

:మధ్యప్రదేశ్ : .. పుట్టగొడుగుల కోసం అడవిలోకి వెళ్లి .. పులికి ఆహారంగా ఉపాధ్యాయుడు…

vimala p

హైదరాబాద్‌లో ఐటీ పురోగతి : కేటీఆర్

vimala p