క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసుల పై దాడి… వైరల్ గా మారిన వీడియో

Traffic Police Attacked by Drunk Man

నడిరోడ్డులో ఒక తాగుబోతు రెచ్చిపోయాడు .హెల్మెట్ ఎక్కడ అని ప్రశ్నించన పోలీసులనే చితకబాదాడు . విచక్షణారహితంగా కొట్టడంతో ఓ ట్రాఫిక్‌ పోలీసు తలలోంచి రక్తం కారింది.ఈ ఘటన బుధవారం (అక్టోబర్ 10) మధ్యాహ్నం 12 గంటల సమయంలో కర్ణాటకలోని దావణగెరె ప్రాంతంలో చోటుచుసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దావణగెరెలో ఓ ప్రాంతంలో ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తున్న వాహనదారులకు చలానాలు వేస్తున్నారు. అదే సమయంలో ఆ మార్గం ద్వారా రుద్రేశ్‌ అనే వ్యక్తి తన బైక్‌పై వచ్చాడు. అతణ్ని పోలీసులు అడ్డుకున్నారు. అతడు మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు గుర్తించారు.

రుద్రేశ్‌ వాహనాన్ని నిలిపేసి అతడిపై చలానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. దీంతో అతడికి ఆగ్రహంతో ఊగిపోయాడు . ఆ ఇద్దరు ట్రాఫిక్‌ పోలీసులపై విరుచుకుపడ్డాడు. రోడ్డు పక్కన ఉన్న ఓ మట్టి పాత్రతో ఓ పోలీసు తలపై బలంగా కొట్టడంతో ఆయన తలకు దెబ్బ తగిలి రక్తం కారింది. అనంతరం మరో పోలీసు వద్దకు పరుగెత్తుకెళ్లిన రుద్రేశ్‌ ఆయణ్ని కిందపడేసి కొట్టాడు. మద్యం మత్తులో తుళ్లిపడిపోతూ లేచి మరీ పోలీసులపై దాడి చేశాడు. దాడిలో తలకు గాయాలైన పోలీసు కానిస్టేబుల్ నారాయణ రాజును ఆస్పత్రికి తరలించి చికిత్స తీసుకున్నారు. ఎట్టకేలకు పోలీసులు రుద్రేశ్‌ను పట్టుకున్నారు. అతణ్ని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. 

Related posts

పవన్ కళ్యాణ్ బహిరంగ సభ…చింతలపూడిలో…

chandra sekkhar

కడపలో స్టీల్ ఫ్లాంట్‌ను నెలకొల్పుతాం: చంద్రబాబు

madhu

డయానా ఈరప్ప… ‘చిత్రాలు’…

chandra sekkhar

Leave a Comment