telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఎవరెస్టుపై ట్రాఫిక్ జామ్…!?

Mount-Everest

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్‌పై బుధవారం ట్రాఫిక్ జామ్ అయ్యింది. పర్వతంపై ట్రాఫిక్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా ? వివిధ దేశాలకు చెందిన 200 మంది పర్వతాధిరోహకులు ఒకేసారి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నించడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఒకేసారి వందల సంఖ్యలో అధిరోహకులు రావడంతో, పర్వత శిఖరానికి చేరుకోడానికి చాలా మంది గంటల పాటు క్యూలో వేచి ఉండాల్సి వచ్చిందని పర్యాటకశాఖకు చెందిన అధికారి గ్యానేంద్ర శ్రేష్ఠ తెలిపారు. మరోపక్క తాను పర్వతాన్ని ఎక్కడం 24వ సారి అని నేపాల్‌కు చెందిన 50 ఏళ్ల పర్వాతాధిరోహకుడు చెప్పాడు. వసంత రుతువు కావడంతో ప్రభుత్వం 381 మందికి పర్వతాన్ని అధిరోహించడానికి అనుమతి ఇచ్చింది. ఈ కారణంగానే వందలాది మంది ఒకేసారి పర్వతంపైకి చేరుకోడానికి ఆసక్తి కనబరిచారు. ప్రతి ఏడాది మార్చి నుంచి జూన్ వరకు మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించే వారి సంఖ్య వందల్లోనే ఉండటం విశేషం. 1953 నుంచి ఇప్పటివరకు 4,400 మందికి పైగా మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారు.చేరుకోవడం విశేషం.

Related posts