రాజకీయ వార్తలు వార్తలు

బాబు దీక్షతో … ట్రాఫిక్ జామ్

కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చకుండా ఇబ్బంది పెట్టడంతో నిరసనగా కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం వైదొలిగింది.
మోడీ వైఖరికి నిరసనగా చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తానని వారం రోజుల క్రితమే ప్రకటించాడు. తన జన్మ దినం రోజున జన్మభూమి కోసం ధర్మ పోరాట దీక్ష చేస్తానని ప్రకటించి, ఈ రోజు ఈ దీక్షకు కూర్చున్నారు చంద్రబాబు.
చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ ధర్మ నిరాహార దీక్షకు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం వేదికైంది. ఉదయం 7 గంటలకే చంద్రబాబు దీక్షా శిబిరానికి చేరుకున్నారు. ఆయనకు తెలుగుదేశం నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం చెప్పారు. అతిపెద్ద వేదిక మీద ఆ చంద్రబాబు ఆసీనులయ్యారు.
ఇదిలా ఉండగా చంద్రబాబు దీక్ష కారణంగా హనుమాన్ జంక్షన్ లో భారీగా ట్రాఫిక్  జామ్ అయింది. పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఈ ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుందని అంటున్నారు.
జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. హనుమాన్ జంక్షన్ నుండి ఏలూరు వైపు దాదాపుగా 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడంతో వారు పోలీసులపై మండిపడుతున్నారు.

Related posts

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నే గెలవాలి… : కేటీఆర్

chandra sekkhar

హిప్పీ మూవీ ‘చిత్రాలు’…

chandra sekkhar

ఆదాయ ఠాకూర్.. ‘చిత్రాలు’..

chandra sekkhar

Leave a Comment