telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

దేశవ్యాప్తంగా.. నిరసనకు సిద్దమవుతున్న .. కార్మిక సంఘాలు..

trade unions announced protest in india

పది కేంద్ర కార్మిక సంఘాలు ఆగస్టు రెండో తేదీన దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలు జరుపాలని పిలుపునిచ్చాయి. కార్మిక చట్టాల సరళీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ యోచనకు వ్యతిరేకంగా ఈ సమ్మె జరగనుంది. ఇప్పటి వరకు అమలులో ఉన్న కార్మిక చట్టాల స్థానంలో రెండు లేబర్ కోడ్‌లను అమలులోకి తేవాలని, అందుకు పార్లమెంట్‌లో బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది.

ఈ కోడ్‌ల ముసాయిదా రూపకల్పనలో తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించిన ప్రభుత్వం.. వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని సదరు కార్మిక సంఘాలు ఆరోపించాయి. నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చిన సంఘాల్లో ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్‌ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీ ఉన్నాయి.

Related posts