telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ట్రాక్టర్ డ్రైవర్ కి .. హెల్మెట్ లేదని .. చలానా అంట.. జరభద్రం బాబులు..

tractor driver got challan for no helmet

ఇటీవల రవాణా చట్టంతో కొత్త తిప్పలు తప్పడంలేదు. ఈ విషయంపై ఆయా రాష్ట్రాలు తమదైన శైలిలో ఆయా రాష్ట్ర ప్రజలను ఆడుకుంటున్నారు. అయినా కొన్ని కొన్ని చలానాలు చూస్తే విస్తుపోక తప్పడంలేదు.. అంత విచిత్రంగా ఉన్నాయి. అది ట్రాఫిక్ అధికారుల చేతి వాటమో లేక చట్టంలో ఉన్న లూప్ హోల్ ని వాళ్ళు అలా వాడేసుకుంటున్నారో తెలియదు కానీ, సదరు వాహనదారు మాత్రం బలైపోతున్నాడు. తాజాగా ట్రాక్టర్ పై వెళ్లే అతడికి హెల్మెట్ పెట్టుకోలేదని ట్రాఫిక్ పోలీసులు జరిమానా వేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. చెప్పులు వేసుకుని వాహనం నడిపినా చలానా విధిస్తారని తెగ ప్రచారం జరిగింది. తాజాగా ట్రాక్టర్ డ్రైవర్‌కు హెల్మెట్ లేదని ఫైన్ వేయడం..దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

గఢ్ ముక్తేశ్వర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్‌కు దేవేంద్ర కుమార్‌కు ఈ మేరకు చలాన్ అందింది. దీనిపై తాను ఎంక్వయిరీ చేయగా హెల్మెట్ పెట్టుకోలేదని, లైసెన్స్ కూడా లేదని ఇందుకు రూ. 3 వేలు చెల్లించాలని ఉందని తెలిసిందన్నాడు. షాక్‌కు గురయ్యాయని, వెంటనే తాను అధికారులకు కంప్లయింట్ చేసినట్లు తెలిపాడు. దీనిపై ట్రాఫిక్ ఇన్ చార్జీ అజయ్ వీర్ సింగ్ స్పందించారు. సంబంధిత కానిస్టేబుల్‌తో తాను మాట్లాడడం జరిగిందని, చలాన్ విధించే క్రమంలో అధికారులు కంప్యూటర్‌లో టైప్ చేసినప్పుడు తప్పు జరిగిందన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇది జరిగిందని, దీనికి సంబంధించిన చలాన్‌ను రద్దు చేసినట్లు వెల్లడించారు.

Related posts