telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నో ఎల్ఆర్ఎస్.. నో టీఆర్ఎస్ : పీసీసీ చీఫ్

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఎల్‌ఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి… ఓవైపు కరోనాతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు.. ప్రజలను పీల్చిపిప్పిచేసే విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చిందని మండిపడుతున్నారు నేతులు.. దీనిపై “నో ఎల్ఆర్ఎస్”.. “నో టీఆర్ఎస్” అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తామన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి… కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో.. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో   పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని మండిపడ్డారు.. కొర్పొరేట్ సంస్థల మేలు కోసమే మోడీ కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చారని మండిపడ్డ ఆయన.. అధిక వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి రాష్ట్రప్రభుత్వం పైసా సహాయం కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలపై అధిక భారం పడుతుంది.. “నో ఎల్ఆర్ఎస్”.. “నో టీఆర్ఎస్” నినాదంతో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.. ఎవరూ ఎల్ఆర్ఎస్ కట్టొద్దు.. రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని పీసీసీ చీఫ్ ఉత్తమ్ అన్నారు.

Related posts