telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

రేపటి నుంచి శ్రావణమాసం ..ఈ సారి శుభ ముహూర్తాలు లేవు!

shravana masam

మహిళలు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసం రేపు ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరంలో మాసం తొలిరోజునే శుక్రవారం కావడం గమనార్హం. వాస్తవానికి నేటి మధ్యాహ్నం నుంచే శ్రావణమాసం మొదలైనట్టు. కానీ, రేపు ఉదయం సూర్యోదయం తరువాత శ్రావణ పాడ్యమి మిగులు ఉండటంతో రేపటి నుంచే శ్రావణం ఆరంభమవుతుంది.

శ్రావణంలో ఎన్నో పర్వదినాలు ఉన్నాయి. 4న నాగుల చవితి, 6న మంగళగౌరీ వ్రతం, 9న రెండో శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతం, 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం, రాఖీ పౌర్ణమి రానున్నాయి. పౌర్ణమి నుంచి రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు జరుగనున్నాయి. 19వ తేదీన సంకష్టహర చతుర్థి, 23న కృష్ణాష్టమి పర్వదినాలు రానున్నాయి. ఈ మాసమంతా వైష్ణవాలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుందనడంలో సందేహం లేదు. ఇదే సమయంలో ఎంతో శుభమని భావించే శ్రావణంలో శుభ ముహూర్తాలు లేకపోవడం గమనార్హం.

Related posts