telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

రేపటితో ఎన్నికల ప్రచార ముగింపు .. 19తో ఎన్నిక కూడా పూర్తి .. ఆ నాలుగు రోజులే ముఖ్యం..

evm issues even in 4th schedule polling

దేశంలో ఎన్నికల హడావుడి ప్రారంభం అయి, ఏడు విడుతల లోక్‌సభ ఎన్నికల సంగ్రామం తుది అంకానికి చేరుకుంది. ఏప్రిల్ 11న తొలి విడుత ఎన్నికలతో ప్రారంభమైన ప్రజాస్వామ్య మహాక్రతువు ఈ నెల 19న జరుగనున్న చివరి విడుతతో పరిసమాప్తం కానుంది. మే 23న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకుగాను 483 స్థానాలకు ఇప్పటికే ఎన్నికలు పూర్తికాగా, మిగిలిన 60 సీట్లలో 59 సీట్లకు చివరి విడుతలో పోలింగ్ జరుగనుంది. విచ్చలవిడి ధనప్రవాహం నేపథ్యంలో తమిళనాడులోని వెల్లూర్ నియోజకవర్గ ఎన్నికను ఎన్నికల సంఘం రద్దు చేసింది.

యూపీలో 13, పంజాబ్‌లో 13, పశ్చిమబెంగాల్‌లో 9, బీహార్‌లో 8, ఎంపీలో 8, హిమాచల్‌ప్రదేశ్‌లో 4, జార్ఖండ్‌లో 3, చండీగఢ్‌లో ఒక స్థానానికి చివరి విడుతలో ఎన్నికలు జరుగనున్నాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడనుంది. పెద్ద ఎత్తున హింస జరుగుతున్న బెంగాల్‌లో ఒకరోజు ముందుగానే ప్రచారం నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. చరిత్రలో మొదటిసారి తీసుకున్న నిర్ణయంతో గురువారమే బెంగాల్‌లో ప్రచారం ముగియనుంది.

లోక్‌సభ ఎన్నికల తుది అంకానికి చేరుకుంది. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను 483 స్థానాలకు ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. మిగిలిన 60 సీట్లలో 59 సీట్లకు చివరి(ఏడో) విడుతలో ఈనెల 19న పోలింగ్ జరుగనుంది. విచ్చలవిడి ధనప్రవాహం నేపథ్యంలో తమిళనాడులోని వెల్లూర్ నియోజకవర్గ ఎన్నికను ఎన్నికల సంఘం (ఈసీ) రద్దు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 13, పంజాబ్‌లో 13, పశ్చిమ బెంగాల్‌లో 9, బీహార్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 8, హిమాచల్‌ప్రదేశ్‌లో 4, జార్ఖండ్‌లో 3, చంఢీగఢ్‌లో ఒక స్థానానికి ఏడో విడుతలో ఎన్నికలు జరుగనున్నాయి.

Related posts