telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గ్రేటర్‌ వార్‌ : రేపే కౌంటింగ్‌…పార్టీలో టెన్షన్‌

గ్రేటర్‌ ఫలితాలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. జీహెచ్‌ఎంసీ పోరులో.. అభ్యర్థుల భవితవ్యం రేపే తేలనుంది. బల్దియా ఎన్నికల్లో సగానికంటే తక్కువే పోలింగ్‌ నమోదు కాగా.. శుక్రవారం ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. కొన్ని డివిజన్లలో మధ్యాహ్నం వరకే ఫలితాలు వచ్చే అవకాశం ఉండగా… మరిన్ని చోట్ల రిజల్ట్స్‌ ఆలస్యమయ్యే ఛాన్స్‌ ఉంది. గ్రేటర్‌ ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు సిద్ధమవుతున్నారు. స్ట్రాంగ్‌ రూముల్లో ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని శుక్రవారం తేల్చనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 ప్రాంతాల్లోని… కౌంటింగ్‌ సెంటర్లలో 150 హాల్స్‌ ఏర్పాటు చేశారు. ప్రతి హాల్‌కు 14 టేబుల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌కు ఒక కౌంటింగ్‌ సూపర్‌ వైజర్‌.. ఇద్దరు కౌంటింగ్‌ అసిస్టెంట్లు ఉండనున్నారు. బల్దియా పోరులో.. మొత్తం 46.55 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 74 లక్షల 67 వేల 256 మంది ఓటర్లలో.. 34 లక్షల 50 వేల 331 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 18 లక్షల 60 వేల 40 మంది పురుషులు, 15 లక్షల 90 వేల 219 మంది మహిళలు ఓటేశారు. ఇతరులు 72 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Related posts