telugu navyamedia
వ్యాపార వార్తలు

మార్కెట్‌లో టమోటాలకు రెక్కలొచ్చాయి..

దేశవ్యాప్తంగా మార్కెట్‌లో టమోటా ధ‌ర‌ల‌కు రెక్కలొచ్చాయి. టమాట ధర రోజురోజుకు పెరగ‌డంతో సామాన్య ప్ర‌జ‌ల‌కు ట‌మాటాలు కొనాల‌న్నా క‌ష్ట‌మే. ప్రస్తుతం మండిపోతున్న ధరలతో టమోటాలు లేకపోతే ఏ వంట చేయాలన్న ఆడ‌వాళ్ళ‌కు కాస్త ఇబ్బందే అని చెప్పాలి.

ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా టమోటా ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వారం రోజుల క్రితం సెంచరీ మార్క్‌కు చేరిన టమాట ధర… ఇపుడు రూ. 130కి చేరింది.

దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో టమోటా దిగుబడి బాగా తగ్గిపోయింది. దీంతోపాటు.. డిమాండ్ పెరగడంతో టమోటా ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడం కారణంగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. కొత్త పంట చేతికొచ్చే వరకు పరిస్థితి ఇలానే ఉండేలా కన్పిస్తోంది.

Govt fails to control prices of tomatoes despite claims

మదనపల్లె మార్కెట్లో కిలో టమోటా ధర 130

ఆసియాలో అతిపెద్ద టమాట మార్కెట్‌గా గుర్తింపు పొందిన ఆంద్ర‌ప్ర‌దేశ్‌లోని మదనపల్లె మార్కెట్‌ యార్డులో గతంలో ఎన్నడూ లేని విదంగా టమాట ధర పలికింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా మదనపల్లె మార్కెట్ నుంచి టమోటాలు ఎగుమతి అవుతుంటాయి.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మదనపల్లె, పలమనేరు ప్రాంతంలో టమోటా పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.దీంతో మార్కెట్ కు టమోటాలు అతి తక్కువగా వస్తున్నాయి. మార్కెట్లో కిలో టమోటా ధర రూ.130 పలికింది. చరిత్రలోనే అత్యధిక ధర చెల్లించి రైతుల నుంచి వ్యాపారులు టమాట కొనుగోలు చేస్తున్నారు.

Related posts