telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

టమాటతో .. లివర్ ఆరోగ్యం.. !

tomato for healthy liver

వంట ఇంట్లో ఉండే కూరగాయలలో ప్రధానంగా ఉండేది టమాటా. ఎర్రటి టమాటా అటు సలాడ్ చేసుకున్నా, ఇటు కూరలలో వేసుకున్నా కలర్ ఫుల్ గా ఉంటుంది. మంచి రుచి కూడా ఉంటుంది. దీనిని పచ్చిగా తినేయమన్నా పిల్లలు కూడా తింటారు. ఇక మార్కెట్‌లో రేటు ఎంత తక్కువైనా, ఎక్కువైనా వీటి వాడకం అనివార్యం. అయితే వీటి వాడకం వల్ల కూరలు రుచికరంగా మారడమే కాకుండా ఆరోగ్యానికి తగిన మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

* నిత్యం టమాటాలను ఆహారంలో ఎక్కువగా తీసుకున్నట్లయితే, లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని, లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు చేపట్టిన తాజా అధ్యయనాలలో తేలింది.

* టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ క్రమంలోనే లైకోపీన్ శాతం ఎక్కువగా ఉండే టమాటా పౌడర్‌ను ఎలుకలకు తినిపించి సైంటిస్టులు వాటిపై ప్రయోగం చేశారు. దీని వలన వాటిలో క్యాన్సర్ కణాల వృద్ధి తగ్గిందని, బాక్టీరియా పెరుగుద‌ల న‌శించింద‌ని సైంటిస్టులు గుర్తించారు.

* ట‌మాటాల‌ను ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల వాటిల్లో ఉండే లైకోపీన్ క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల‌ను అడ్డుకుంటుంద‌ని, తద్వారా క్యాన్స‌ర్ రాకుండా చేస్తుంద‌ని, అలాగే ఆరోగ్యాన్ని కూడా మెరుగు ప‌రుస్తుంద‌ని సైంటిస్టులు పేర్కొంటున్నారు.

* గుండె జబ్బులను కూడా రాకుండా టమాటా ప్రయోజనం చేకూరుస్తుందని అంటున్నారు. కాబట్టి టమాటాలను ఆహారంలో ఎక్కువగా ఉపయోగించే వారు పైన పేర్కొన్న ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందినట్లే మరి.

Related posts