telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కనీసం నీళ్ళు కూడా తాగకుండా కష్టపడుతున్న యంగ్ హీరో…!

NS20

యంగ్ హీరో నాగశౌర్య ఈ ఏడాది ‘అశ్వథ్థామ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే తర్వాత కరోనా లాక్ డౌన్ పడటంతో తన తర్వాత సినిమాకు సంబంధించిన అప్డేట్ ను కాస్త ఆలస్యంగానే వెల్లడించారు. నాగశౌర్య కెరీర్‌లో 20వ సినిమాగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇక సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో నాగశౌర్య విలుకాడిగా నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన నాగశౌర్య ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. ఈ పాత్రలో ఎయిట్ ప్యాక్ బాడీ షేప్ తో కనిపిస్తాడు. ఇందుకోసం ఎన్నో వర్కౌట్స్ చేస్తూ స్ట్రిక్ట్ డైట్ అనుసరిస్తున్నాడు. ఈ క్రమంలో దానిని తెరపై ప్రదర్శించడం కోసం గత ఐదు రోజులుగా నాగశౌర్య పచ్చి మంచినీళ్లు కూడా తాగడం లేదట. లాలాజలాన్ని కూడా మింగకుండా ఆ బాడీ షేప్ ప్రదర్శించడం కోసం ఎంతో రిస్క్ చేస్తూ, శ్రమిస్తున్నాడని యూనిట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కేతికా శర్మ కథానాయికగా నటిస్తోంది.

Related posts