telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

వరద బాధితులకు అండగా భారీ విరాళాలు ప్రకటించిన టాలీవుడ్ స్టార్లు

హైదరాబాద్ ను గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. దీంతో హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే… భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎం కెసిఆర్ పిలుపుకు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే.. మేఘా సంస్థ, తమిళనాడు, ఢిల్లీ ప్రభుత్వాలు విరాళాలు ఇచ్చారు. వరద బాధితులకు అండగా నిలిచి, ప్రభుత్వ సహాయక చర్యలకు అండగా ఉండేందుకు ఈ సహాయం ప్రకటించినట్లు వారు తెలిపారు. తాజాగా వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ స్థైతం ముందుకు వచ్చింది. వరద బాధితులకు మేము అండగా ఉంటామని పేర్కొన్నారు. చిరంజీవి కోటి రూపాయలు, మహేష్ బాబు కోటి రూపాయలు,  నాగార్జున 50 లక్షలు, జూ ఎన్టీఆర్ 50 లక్షలు, విజయ్ దేవరకొండ 10 లక్షలు, హారికా హాసిని క్రియేషన్స్ 10 లక్షలు, త్రివిక్రమ్ శ్రీనివాస్ 10 లక్షలు, అనీల్ రావిపూడి 5 లక్షలు, హరీష్ శంకర్ 5 లక్షలు ప్రకటించారు.

Related posts