telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిర్మాతగా మారబోతున్న మరో స్టార్ డైరెక్టర్

Harish-Shankar

తెలుగు ఇండస్ట్రీలో మరో స్టార్ డైరెక్టర్ నిర్మాతగా మారబోతున్నాడని తెలుస్తోంది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీయాలనే ఉద్ధేశంతో దర్శకుడు హరీష్ శంకర్ నిర్మాతగా మారుతున్నారని సమాచారం. మహేష్ కోనేరుతో కలిసి హరీష్ శంకర్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించనున్నట్టు ప్రచారం జరగుతుండగా, ఇప్పటికే ఆ ప్రొడక్షన్‌లో రూపొందబోయే సినిమా పనులు కూడా మొదలయ్యాయని సమాచారం. నిహారిక నటించిన సూర్యకాంతం సినిమా ఫేమ్ యువ దర్శకుడు ప్రణీత్ తో హరీష్ నిర్మాతగా తొలి సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే సుకుమార్, పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు సొంతంగా నిర్మాణ సంస్థలు ఓపెన్ చేసి అందులో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా నిర్మిస్తున్నారు.

Related posts