telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తన లోపాలని ఇష్టపడే వ్యక్తి అతనే : పాయల్ రాజ్‌పుత్

payal

ఆర్ఎక్స్ 100 సినిమాతో కుర్రాళ్ల మనసు దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసినా కూడా ఏది ఈమెకు కలిసిరాలేదు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అందరికీ షాక్ ఇచ్చింది పాయల్. సోషల్ మీడియాలో తన ప్రియుడిని పరిచయం చేసింది. ఆయన పేరు సౌరభ్ డింగ్రా అని ముద్దుగా చెప్పింది పాయల్. ముంబైలో మోడల్‌ ప్రేమలో పడిపోయింది ఈ బ్యూటీ. ఒకానొక సందర్భంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని చెబుతుంది ఈమె. ఈ ఇద్దరూ కొన్ని రోజులుగా డేటింగ్ చేస్తున్నారు. ఆ మధ్య సౌరభ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ఇద్దరూ మంచి జోరులో ఉన్నపుడు తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పుడే పనిలో పనిగా తన ప్రేమ విషయాన్ని కూడా చెప్పింది ఈ ముద్దుగుమ్మ. తన లోపాలని ఇష్టపడే ఏకైక వ్యక్తి అంటూ ఇద్దరి మధ్య వున్న అనుబంధాన్ని పాయల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

Related posts