telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు సాంకేతిక సామాజిక సినిమా వార్తలు

ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో “టాలీవుడ్”

Tollywood

ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీని ఏటా నాలుగు సార్లు అప్‌డేట్ చేస్తారు. ఈ క్రమంలో కొన్ని కొత్త పదాలను చేరుస్తారు. వీటితో పాటు పాత పదాలకు కొత్త అర్థాలను చేరుస్తుంటారు. మళ్లీ ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ డిక్షనరీని నవీకరిస్తారు. కొత్త పదాలతో పాటు పాత పదాలకు కొత్త అర్థాలను కూడా చేర్చారు. ఈ దఫా ఇలా మొత్తం 650 పైగా కొత్త ఎంట్రీలు ఆక్స్‌ఫర్డ్‌లో చేరాయి. ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్ డిక్షనరీలో మన టాలీవుడ్ చేరింది. ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో ఈ ఏడాది అక్టోబర్‌లో కొత్తగా 203 పదాలను చేర్చారు. వీటిలో టాలీవుడ్ ఒకటి కావడం విశేషం. దీనికి తెలుగు సినీ పరిశ్రమ అని అర్థం ఇచ్చారు. మరో అర్థంగా బెంగాలీ సినీ పరిశ్రమ అని కూడా చేర్చారు. ఈసారి కొత్తగా చేర్చిన పదాల్లో ఫేక్‌ న్యూస్, సింపుల్స్, నోమోఫోబియా, జెడి, చిల్లాక్స్ తదితరాలు ఉన్నాయి.

కొత్తగా చేర్చిన కొన్ని పదాలు – అర్థాలు

ఫేక్ న్యూస్ (Fake News) : ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని అందించే వార్తలు, లేదా ఆ రకంగా చేస్తున్నాయని ఆరోపించిన వార్తలు; బూటకం, కట్టుకథలు.

క్రిప్టోకరెన్సీ (Cryptocurrency) : లాంఛనప్రాయం కాని ప్రత్యామ్నాయ నగదు (అరుదైన నగదు)

నోమోఫోబియా (Nomophobia) : మొబైల్ ఫోన్, మొబైల్ ఫోన్ సర్వీసులు అందుబాటులో లేనప్పుడు కలిగే ఆందోళన.

చిల్లాక్స్ (Chillax): శాంతించి విశ్రాంతి తీసుకోవటం, తేలికగా తీసుకోవటం, సంతోషించడం

ఆంగ్లంలో తెలుగు పదాలు :
ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ఆంగ్ల పదాల్లో కొన్ని తెలుగు పదాలను స్ఫురించేవిధంగా ఉన్నాయి. ద్రవిడ మూలాలున్న పదాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని..
Pitta (పిట్ట), Aiyo (అయ్యో), Congee (గంజి), Godown (గిడ్డంగి), Sambal (సాంబారు), Teak (టేకు), Bandicoot (పందికొక్కు) మొదలైనవి.

Related posts