telugu navyamedia
సినిమా వార్తలు

ఈడీ విచారణకు నటి ముమైత్​ఖాన్..

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే పలువురు సినిమాతారలను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే నటి ముమైత్​ఖాన్ నేడు ఈడీ అధికారుల ఎదుట హాజరు కానున్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలపై అధికారులు ఆమెను ప్రశ్నించనున్నారు. కెల్విన్, వాహిద్​లను ఈడీ అధికారులు మరోసారి ప్రశ్నించే అవకాశం ఉంది.

Mumaith Khan (Actress) Biography, Age, Wiki, Family, Marriage, Height, Husband

ఇప్పటివరకు పూరిజగన్నాథ్, ఛార్మి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రానా, నవదీప్, నందు, రవితేజల‌ను ఎఫ్​ క్లబ్​ జనరల్​ మేనేజర్​తో పాటు డ్రగ్స్ సప్లేయిర్ కెల్విన్‌తో ఉన్న సంబంధాలపై సుదీర్ఘంగా ప్రశ్నించారు . ప్రధానంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించి వారి ఖాతాల్లో అనుమానాస్పదంగా ఉన్న లావాదేవీలపై అడిగి తెలుసుకున్నారు. కెల్విన్‌, వాహిద్‌ ఎంత కాలంగా తెలుసు, వారి నుంచి మాదకద్రవ్యాలు కొనుగోలు చేశారా, నగదు బదిలీ ఏ విధంగా చేశారు, ఎంత నగదు చెల్లించారు… అనే విషయాలపై ఈడీ అధికారులు లోతుగా ఆరా తీశారు..

ఇక నేడు నటి ముమైత్ ఖాన్ వంతు వచ్చింది. కెల్విన్‌తో ఉన్న సంబంధాలతోపాటు.. ఆమె బ్యాంకు ఖాతాల‌ను అధికారులు పరిశీలించనున్నారు. అలాగే మిగిలిన డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాదారుల‌తో ఆమె ఉన్న సంబంధాలు, వారితో జ‌రిపిన సంప్ర‌దింపుల‌పై ఆరా తీయనున్నారు. ఇక 17న తనీశ్, 22న తరుణ్ విచారణకు హాజరుకానున్నారు

Related posts