telugu navyamedia
సినిమా వార్తలు

ముగిసిన తరుణ్ విచారణ..

టాలీవుడ్  డ్రగ్స్ కేసులో తరుణ్ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు ఈడీ తరుణ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన బ్యాంక్ లావాదేవీలపై ఈడీ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. అయితే బ్యాంక్ డ్యాక్సుమెంట్స్ అడగడంతో ఆయన తండ్రి కూడా విచారణకు హాజరయ్యారు.

ఈ  కేసులో ఇప్పటి వరకు 12 మంది సినీ సెలబ్రిటీలు తమ బ్యాంక్ ఖాతాల వివరాలు, స్టేట్ మెంట్ లతో విచారణకు హాజరయ్యారు. విచారణ కు తమతో పాటు తమ  చార్టెడ్ అకౌంట్ లను పలువురు తారలు తీసుకొచ్చారు.దీంతో ఈడీ అధికారులు తరుణ్ తండ్రిని కూడా ప్రశ్నించారు.

2017 డ్రగ్స్ కేసులో తరుణ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ అంశాల ఆధారంగా అధికారులు ప్రశ్నించారు. 2017 జూలై 19 స్వచ్ఛంద ఎక్సైజ్ శాఖ కు బయో షాంపుల్స్ ఇచ్చాడు తరుణ్. ఆయన ఇచ్చిన బయో షాంపుల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేనట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రీపోర్ట్ ఇచ్చింది. తాజాగా మరోసారి కెల్విన్ ఇచ్చిన వివరాలపై తరుణ్ ను విచారించారు. అలాగే కెల్విన్‏తో ఉన్న సంబంధం గురించి కూడా ఈడీ విచారించింది.

పూరి జగన్నాథ్ తో  ప్రారంభమైన ఈడీ విచారణ..  తరుణ్ తో  ఇక ఈరోజు సినీ తారల విచారణ ముగిసింది.

ED Summons, Rakul Preet And Ravi Teja Along With 12 Others In The Drugs Case

సినీతారల విచారణ జరిగింది ఇలా..

ఆగస్ట్ 31న పూరి జగన్నాథ్ ను 10 గంటల పాటు ఈడీ విచారించింది.

సెప్టెంబర్ 2న ఛార్మి నీ 8 గంటల పాటు విచారించారు.

సెప్టెంబర్ 6న రకుల్ ప్రీత్ సింగ్ హాజరు కావాల్సి ఉండగా.. సెప్టెంబర్ 3నే హాజరైంది.

సెప్టెంబర్ 3న రకుల్  ను  6 గంటల పాటు ఈడీ విచారించింది.

సెప్టెంబర్ 20న  హాజరు కావాల్సి ఉండగా.. సెప్టెంబర్ 7 న హాజరయ్యాడు.

సెప్టెంబర్  7న కెల్విన్, జీషాన్ ఈడీ కార్యాలయానికి వచ్చారు. కెల్విన్, జీశాన్ ల ఇళ్లలో సోదాలు చేసి ఈడి కార్యాలయానికి తీసుకొచ్చిన అధికారులు.

సెప్టెంబర్ 8న రానాను 8 గంటల పాటు విచారించిన ఈడీ.. రానా, నందు విచారణకు  హాజరు అయ్యిన రోజుల్లో కెల్విన్ , జీశాన్ లను కలిపి విచారించారు.

సెప్టెంబర్ 9న రవితేజ తో పాటు డ్రైవర్ శ్రీనివాస్ ను 6 గంటల పాటు విచారించింది.

సెప్టెంబర్ 13న నవదీప్ తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్ ను 9 గంటల పాటు ఈడీ విచారించింది.

సెప్టెంబర్ 15న ముమైత్ ఖాన్ ను 7 గంటల పాటు విచారించింది.

సెప్టెంబర్ 17న తనీష్ ను 7 గంటల పాటు ఈడీ విచారించింది.

Related posts