telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ కమెడియన్ అలీ ఇంట్లో విషాదం

ali

టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ ఇంట్లో విషాదం నెలకొంది. అలీ మాతృమూర్తి జైతన్ బీబీ (75) అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. రాజమండ్రిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.41కి మరణించారు. అలీ ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ నిమిత్తం రాంచీలో ఉన్నారు. తల్లి మరణ వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరారు. జైతన్ బీబీ భౌతిక కాయాన్ని రాజమండ్రి నుంచి హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తల్లి పట్ల అలీకి ఉన్న ప్రేమానురాగాల గురించి తెలిసిందే. తల్లితో తన అనుబంధం గురించి అలీ పలు సందర్భాల్లో వెల్లడించారు. అలీ ఇప్పటికే త‌న తండ్రి పేరు మీద ఇప్ప‌టికే అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్న విషయం తెలిసిందే.

Related posts