telugu navyamedia
సినిమా వార్తలు

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ పై ప్రముఖుల స్పందన

Indian-air-Force

కొన్ని రోజుల క్రితం పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యంతోపాటు ప్రతీ భారతీయుడు ఆగ్రహంతో ఉడికిపోయాడు. ఈ ఉగ్రదాడిలో 40 మందికిపైగా భారత జవాన్లు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉగ్రవాదులపై ప్రతీకార చర్యగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మంగళవారం తెల్లవారు జామున పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈరోజు ఉదయం 3 గంటలకు జైషే మొహమ్మద్ టెర్రర్ క్యాంపులపై బాంబుల వర్షం కురిపించింది. ఈ సర్జికల్ స్ట్రైక్స్ పై పలువురు సినిమా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఇండియా స్ట్రైక్ బ్యాక్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సెల్యూట్ చేస్తున్నారు. 

Related posts