telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దిశ ఘటన : ఎన్‌కౌంటర్‌పై సినీ ప్రముఖుల హర్షం

Tollywood

హైదరాబాద్‌లో జరిగిన దారుణ సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వెటర్నరీ డాక్టర్‌ను నలుగురు దుర్మార్గులు దారుణంగా రేప్‌ చేసి తరువాత సజీవ దహనం చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ఇలాంటి దారుణాలు ఇక మీదట జరగకుండా గట్టి చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజలు రోడ్డెక్కారు. ఈ దారుణానికి పాల్పడ్డ రాక్షసులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. అయితే తాజాగా పోలీస్ ఎన్కౌంటర్ లో నిందితులు చావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కాగా.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును చటాన్‌పల్లికి వ్యాన్‌లో తీసుకెళ్లగా వారు పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీలు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిశకు సరైన న్యాయం జరిగిందంటూ ప్రతి ఒక్కరూ వ్యాఖ్యానిస్తున్నారు. సినీ నటులు సైతం ఈ ఎన్‌కౌంటర్‌పై ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు.

దిశ నిందితులని ఎన్‌కౌంట‌ర్ చేయ‌డం ప‌ట్ల సినీ న‌టి స‌మంత త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. ఈ సంఘ‌ట‌న జరిగిన‌ప్పుడు నేను ఏమి స్పందించ‌లేదు. ఎందుకంటే బాధితుల‌కి నా సంతాపం చెల్లించ‌లేద‌ని ఆరోపిస్తూ, నాకు వ‌చ్చిన ప్ర‌తి సందేశం స‌మాజంలో ఉన్న మ‌హిళ‌ల‌కి నేనేమి చేయ‌లేక‌పోయాన‌నే విష‌యాన్ని గుర్తు చేసింది. దానిని నుండి విడిపించ‌డానికి ఈ ఒక్క ట్వీట్ సరిపోదనిపించింది అని స‌మంత తెలిపింది. తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంతో కొంత భయాన్ని మిగ‌తా వారిలో కలిగించారని.. అప్పడప్పడూ ఇలాంటివి అవసరం అని చెప్పింది. అందుకే తెలంగాణ అంటే ప్రేమ అని తెలిపింది.

మా టీజ‌ర్స్ , ట్రైల‌ర్స్ లైక్ చేయిక‌పోయిన ప‌ర్వాలేదు. ద‌య చేసి ఎన్‌కౌంట‌ర్ న్యూస్ ట్రెండింగ్ చేయండి.. ఇలా జ‌రిగింద‌ని చాటింపు చేయండి అని హ‌రీష్ శంక‌ర్ త‌న‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

దిశ త‌ల్లిదండ్రులు కోరుకున్న‌ది జ‌రిగింద‌ని ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ తెలిపారు.

హైద‌రాబాద్ పోలీసుల‌కి నా శుభాకాంక్ష‌లు. మిగ‌తా కేసు నిందితుల‌ని కూడా క‌స్టడీలోకి తీసుకోవ‌డం కాక‌, కేసు స్ట‌డీ చేయాల‌ని బాబీ అన్నారు.

దిశాని మ‌ళ్ళీ మ‌నం తీసుకురాలేక‌పోయిన‌, ఈ ఘ‌ట‌న‌తో నేర‌స్తుల గుండెల్లో వ‌ణుకు ప‌డుతుంద‌ని నిఖిల్ అన్నారు.

న్యాయం జ‌రిగింద‌ని బ‌న్నీ ట్వీట్ చేశాడు.

మ‌న పోలీసుల‌కి సెల్యూట్‌. ఇంకా మ‌న పూర్తి కాలేదు. మ‌హిళ‌లు, సోదరీమణులందరికీ ముప్పు లేని ప్రపంచాన్ని సృష్టించడం సమాజంగా మన బాధ్యత. భవిష్యత్తులో ఏ అమ్మాయి కూడా ఈ అమానవీయ ఘ‌ట‌న జ‌ర‌గ‌కుండా చూడాలి అని కార్తికేయ అన్నారు.

తెలంగాణ పోలీసుల‌ని చూస్తే గ‌ర్వంగా ఉంద‌ని అన‌సూయ అన్నారు.

Related posts