telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ విపత్కర పరిస్థితి నాకో పాఠం నేర్పింది : సమంత

Samantha

అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయం, విభిన్నమైన సినిమాలతో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. జానూ సినిమా తరువాత సమంత నటించిన చిత్రాలేవీ ఇప్పటి వరకు విడుదల కాలేదు. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్ లో వెబ్ వరల్డ్ లో కూడా అడుగు పెట్టబోతోంది. సమంత సోషల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక లాక్‌డౌన్ కారణంగా లభించిన సమయంలో తన ఇంటిపై వ్యవసాయం చేస్తోంది. వాటికి సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. తను వ్యవసాయం చేయడానికి గల కారణాలను వివరిస్తూ సమంత తాజాగా ఓ వీడియో చేసింది. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. “ప్రతి ఒక్కరూ సృజనాత్మకంగా ఏదో ఒక పని చేయడానికి ఇష్టపడతారు. కొందరు డ్యాన్స్ చేస్తారు. కొందరు ఆర్ట్, వంట చేయడం వంటి పనులు చేస్తారు. నేను అలాంటివి చేయలేను. అయితే నేను కూడా కాస్త భిన్నమైన పని ఎంచుకున్నా. అయితే ఈ తోటపని ఎందుకు ఎంచుకున్నానో మీకు చెప్పాలనుకుంటున్నా. లాక్‌డౌన్ గురించి తెలిసిన తర్వాత అందరిలాగానే మేం ఆశ్చర్యపోయాం. చైతూ, నేను వెంటనే సరుకుల కోసం సూపర్ మార్కెట్‌కు పరిగెత్తాం. తెచ్చుకున్న సరుకులు ఎన్ని రోజులు వస్తాయో లెక్క పెట్టుకునే వాళ్లం. అవి అయిపోయిన తర్వాత ఏమి చేయాలోనని భయపడేవాళ్లం. ఈ విపత్కర పరిస్థితి నాకో పాఠం నేర్పింది. మనకు కావాల్సిన ఆహారాన్ని మనమే ఎందుకు పండించుకోకూడదు అనే ఆలోచన వచ్చింది. దాంతో నేను స్వయంగా వ్యవసాయం చేయడం మొదలుపెట్టా” అంటూ సమంత ఆ వీడియోలో పేర్కొంది.

Related posts