telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లావణ్య త్రిపాఠి కరోనా సేఫ్టీ సూట్ వైరల్

Lavanya

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సెలబ్రెటీలు కూడా ఈ మహమ్మారి బారిన పడటం కలవరానికి గురి చేస్తుంది. పలువురు సెలబ్రెటీలు మాస్క్ లు ధరించండని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా లావణ్య త్రిపాఠీ సేఫ్టీ సూట్ ధరించి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొత్త సూట్ ధరించి మెత్తని పరుపు పై దూకుతూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రపంచమంతా కరోనా కారణంగా వణికిపోతుంటే జాగ్రతలు తీసుకోక తప్పదు. ఈ టైమ్ లో రిస్క్ తీసుకోవడం ప్రాణానికే ప్రమాదం. ప్రస్తుతం లావణ్య ధరించిన సేఫ్టీ సూట్ డ్రెస్ బాగానే అనిపించినప్పటికి రోజువారీ దుస్తులలా సౌకర్యంగా మాత్రం అనిపించదు అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం లావణ్య కరోనా సేఫ్టీ సూట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Related posts