telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అర్చన వెడ్డింగ్ రిసెప్షన్… సినీ ప్రముఖులు హాజరు

Archana

బిగ్ బాస్ ఫేం అర్చ‌న వివాహం హెల్త్‌కేర్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ జగదీశ్‌తో ఘ‌నంగా జ‌రిగింది. ఈ తెల్లవారుజామున 1:30 ని.ల‌కి మూడుముళ్ల బంధంతో అర్చన, జగదీశ్‌లు ఒక్క‌టి కాగా, వీరి పెళ్ళి వేడుక‌లో ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు సంద‌డి చేశారు. పెళ్ళికి కొద్ది గంట ముందు రిసెప్షన్ వేడుక నిర్వ‌హించారు. గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్‌లో అర్చ‌న వివాహం జ‌రిగింది. అక్టోబ‌ర్ 3న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో అర్చ‌న‌… జగదీశ్‌తో నిశ్చితార్ధం జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి సుమారుగా 40 సినిమాల్లో న‌టించిన అర్చ‌న చివ‌రిగా ‘వజ్ర కవచధర గోవింద’ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

Related posts