telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఒకే రోజు వివాహం చేసుకోబోతున్న యంగ్ హీరోలు నితిన్, నిఖిల్ సిద్ధార్థ

nitin-akhil

యంగ్ హీరోలు నితిన్, నిఖిల్ సిద్ధార్థ ఒకే రోజు నుంచి తమ దాంపత్య జీవితాన్ని మొదలుపెట్టబోతున్నారు. ఏప్రిల్ 16న వీరిద్దరూ పెళ్లికొడుకులుగా మారనున్నారు. తన పెళ్లి కోసం నితిన్ దుబాయ్ వెళ్తుండగా.. నిఖిల్ మాత్రం హైదరాబాద్‌లోనే పెళ్లి వేడుక చేసుకోనున్నారు.ఇదిలా ఉంటే, గత కొన్నాళ్లుగా భీమవరం అమ్మాయి డాక్టర్ పల్లవి వర్మతో ప్రేమలో ఉన్న నిఖిల్ ఆమెతో ఫిబ్రవరి 1న నిశ్చితార్థం చేసుకున్నారు. గోవాలో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. గోవాలోనే పల్లవి వర్మకు తన లవ్‌ను ప్రపోజ్‌ చేశారట. అందుకే, అక్కడే నిశ్చితార్థం వేడుకను జరుపుకున్నారు. వీరి వివాహం ఏప్రిల్ 16న హైదరాబాద్‌లో జరగనుంది.
మరోవైపు, నితిన్ పెళ్లి ప్రకటన అందరికీ ఒక సర్‌ప్రైజ్. ఎందుకంటే, నితిన్‌ది ప్రేమ వివాహం. కానీ, ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారాయన. కొన్నేళ్లుగా ప్రేమిస్తోన్న అమ్మాయినే ఆయన పెళ్లిచేసుకుంటున్నారు. నాగర్ కర్నూలుకు చెందిన షాలిని కందుకూరిని ఏప్రిల్ 16న నితిన్ పెళ్లాడబోతున్నారు. దుబాయ్‌లో ఏప్రిల్ 15న నిశ్చితార్థం.. 16న కొద్దిమంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగబోతోంది. 21న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.

Related posts