telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరోసారి మారుతి, నాని కాంబినేషన్ ?

Nani

‘భలే భలే మగాడివోయ్’ తర్వాత మారుతి, నాని కాంబినేషన్ మళ్లీ పట్టాలెక్కే సూచనలు కనబడుతున్నాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం మారుతి, నాని కోసం ఫుల్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేస్తోన్నట్లు తెలుస్తోంది. మారుతి ఇప్పటికే నానికి కథ చెప్పినట్లు.. నాని కూడా స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ‘భలే భలే మగాడివోయ్’ సినిమా నేచురల్ స్టార్ నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతోనే నాని మార్కెట్ స్థాయి కూడా పెరిగింది. అందుకే వీరి కాంబినేషన్ లో ఇప్పుడు సినిమా వస్తే భారీ అంచనాలు ఉంటాయి. ఇకపోతే ప్రస్తుతం ‘వి’ చిత్రం చేస్తున్న నాని త్వరలో ‘టక్ జగదీష్’ అనే సినిమాను స్టార్ట్ చేయనున్నారు.

Related posts