telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎల‌క్ట్రిక్‌ సైకిల్ తో నిఖిల్…!

Nikhil

యంగ్ హీరో నిఖిల్ లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఎల‌క్ట్రిక్‌ సైకిల్ ను పరిచయం చేస్తూ మరోసారి నెటిజన్ల ముందుకు వచ్చాడు. హీరో నిఖిల్ ఎల‌క్ట్రిక్‌ సైకిల్‌తో, అలాగే అదిరిపోయే కండలతో దర్శనమిచ్చాడు. ఇక ఈ ఎల‌క్ట్రిక్‌ సైకిల్ విషయానికి వస్తే.. దీనిని ఫుల్ ఛార్జింగ్ చేస్తే 80 కి.మీ. వరకు వస్తుందట. గంటకు 30 కి.మీ. వేగంతో ప్రయాణం చేయవచ్చట. ఈ సైకిల్‌కి సంబంధించిన పూర్తి రివ్యూని త్వరలోనే షేర్ చేస్తానని ఈ సందర్భంగా నిఖిల్ తెలిపాడు. ఈ మధ్య వాతావరణంలోని కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో ఎల‌క్ట్రిక్‌ సైకిల్, ఎల‌క్ట్రిక్‌ బైక్, ఎల‌క్ట్రిక్‌ కార్ వంటి వాడకం బాగా పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజంగానే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగితే వాతావరణ కాలుష్యం తగ్గుతుంది.

Related posts