telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బండ్ల గణేష్ కు కరోనా… టెన్షన్ లో నాగశౌర్య ఫ్యామిలీ

Naga-Shourya

ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త బండ్ల గణేష్ కరోనా బారిన పడటంతో టాలీవుడ్ అంతా అలర్ట్ అయింది. తనకు కరోనా సోకిందనే విషయం తెలియక చాలామందిని గత వారం రోజులుగా ఎంతోమందిని కలిశారు బండ్ల గణేష్. దీంతో ఆయనతో కాంటాక్ట్ అయిన వాళ్ళతో పాటు కుటుంబ సబ్యులకు కూడా కరోనా టెస్టులు చేస్తున్నారు. అయితే బండ్ల గణేష్ కరోనా బారిన పడ్డారనే విషయం తెలియగానే.. టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, ఆయన ఫ్యామిలీ మొత్తానికి టెన్షన్ పట్టుకుందని ఫిలిం నగర్ టాక్. బండ్ల గణేష్ ఉండే వీధిలోనే నాగశౌర్య ఫ్యామిలీ కూడా నివాసముంటోంది. దాంతో ఆయనకు కూడా కరోనా భయం పట్టుకుందని అంటున్నారు. అంతేకాదు నాగశౌర్య ఫ్యామిలీ ప్రస్తుతం అక్కడి నుంచి వేరే చోటకు అర్జెంట్‌గా షిప్ట్ అయిపోయారని కూడా ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. బండ్ల గణేష్‌కి కరోనా పాజిటివ్ అని తెలిసి ఇంకొంతమంది టాలీవుడ్ ప్రముఖులు కూడా ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

Related posts