telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

తెలుగు సినిమా ఇదే స్థాయిలో రాణించాలి: సీఎం జగన్

jagan

జాతీయ స్థాయి అవార్డుల్లో తెలుగు సినిమాలు అవార్డులు సాధించిన నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ సినిమాలు గణనీయమైన స్థాయిలో సత్తా చాటడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా ఇదే స్థాయిలో భవిష్యత్తులోనూ రాణించాలని ఆకాంక్షించారు.

మున్ముందు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభిలషించారు. 66వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో సత్తా చాటిన మహానటి, రంగస్థలం, అ!, చి.ల.సౌ చిత్ర బృందాలకు జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయా చిత్రాల నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్లను అభినందించారు. ఈమేరకు ఏపీ సీఎం కార్యాలయం ఓ ట్వీట్ చేసింది.

Related posts