telugu navyamedia
క్రీడలు

భారత్‌కు మరో స్వర్ణం..

టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం ద‌క్కింది. టోక్యో పారాలింపిక్స్ షూట‌ర్ మ‌నీశ్ న‌ర్వాల్ గోల్డ్‌ మెడ‌ల్ గెలిచాడు. పీ4 మిక్స్‌డ్ 50మీట‌ర్ల పిస్తోల్ ఈవెంట్‌లో మ‌నీశ్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌నతో 218.2 పాయింట్లు స్కోరుతో టాప్‌లో నిలిచి స్వ‌ర్ణ ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకున్నాడు.

Tokyo Paralympics: Shooter Manish Narwal clinches India's 3rd gold, Singhraj bags silver | Tokyo Paralympics News - Times of India

ఇప్పటి వరకు 14 పతకాలు భారత్‌ ఖాతాలో చేరగా తాజాగా మరో రెండు పతకాలు భారత ప్లేయర్స్‌ వశమయ్యాయి. శనివారం జరిగిన షూటింగ్‌లో భారత్‌కు రెండు పతకాలు దక్కాయి. మిక్స్‌డ్‌ 50 మీటర్స్‌ పిస్టల్‌ విభాగంలో మనీష్‌ నర్వాల్‌ మొదటి స్థానంలో నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో భారత్‌ ఖాతాలో గోల్డ్‌ మెడల్స్‌ సంఖ్య మూడుకి చేరింది.

Image

ఇక భారత్‌కు చెందిన మరో ప్లేయర్‌ సింగ్‌ రాజ్‌  (216.7 పాయింట్లు)కు సిల్వ‌ర్ మెడ‌ల్  గెలుచుకున్నాడు. సింగ‌రాజ్‌కు ఈ గేమ్స్ లో ఇది రెండో మెడ‌ల్. మ‌హిళ‌ల షూటింగ్ ఈవెంట్‌లో అవ‌ని రెండు మెడ‌ల్స్ సాధించిన విష‌యం తెలిసిందే.

Image

ఇదిలా ఉంటే శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత షట్లర్ ప్రమోద్ భగత్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. పురుషుల సింగిల్స్ ఎస్ ఎల్ 3 సెమీ ఫైనల్‌లో భారత షట్లర్ ప్రమోద్ భగత్ 21-11, 21-16 తేడాతో జపాన్‌కు చెందిన డైసుకే ఫుజిహారాను ఓడించి ఫైనల్లోకి చేరాడు. ఈ లెక్కన ఇప్పటి వరకు భారత్‌ ఖాతాలో పతకాల సంఖ్య 16కి చేరిందన్నమాట.

శుభాకాంక్షలు తెలిపి మోడీ..
పారాలింపిక్స్‌లో భారత్‌కు ఖాతాలో మరో రెండు పతకాలను చేర్చిన మనీష్‌, సింగ్‌ రాజ్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఇండియాకు పతకాలను తెచ్చి పెట్టిన ఇద్దరు ప్లేయర్స్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, భవిష్యత్తులోనూ ఇలాంటి విజయాలను కొనసాగించాలంటూ మోడీ ట్వీట్ చేశారు.

 

Related posts