telugu navyamedia
క్రీడలు

పారాలింపిక్స్‌లో భారత్‌కు ఓకే రోజు నాలుగు పతకాలు

పారాలింపిక్స్‌లో సోమవారం భారత్‌కు పతకాల పంట పండింది. భారత అథ్లెట్లు ఈరోజు ఇప్పటికే మొత్తం నాలుగు పతకాలను సొంతం చేసుకున్నారు. నేటి పథకాల వేటను ద్వారణంతో ప్రారంభించింది ‘అవని లేఖరా’. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో గోల్డ్ గెలిచింది. పారా ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన తొలి భారత మహిళగా అవని లేఖారా చరిత్ర సృష్టించింది. అనంతరం పురుషుల డిస్క్ త్రో లో రజత పతకం సాధించాడు భారత అథ్లెట్ యోగేష్. 44.38 మీటర్ల దూరం డిస్క్ ను విసిరి ఈ సిల్వర్ ను సొంతం చేసుకున్నాడు.

ఇక ఇప్పుడు పురుషుల జావెలిన్ త్రో లో రెండు పతకాలు భారత్ సొంతం అయ్యాయి. జావెలిన్ త్రో లో గత పారాలింపిక్స్ లో స్వర్ణం గెలిచిన దేవేంద్ర ఈసారి 64.35 మీటర్ల దూరం జావెలిన్ ను విసిరి రజతం సాధించాడు. అలాగే మరో అథ్లెట్ సుందర్ సింగ్ గుర్జర్ ఇదే విభాగంలో 64.01 మీటర్ల జావెలిన్ త్రో ద్వారా కాంస్యం గెలిచాడు. ఇక టోక్యో ఒలంపిక్స్ లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే.

Related posts