telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

హే భగవాన్ .. ఎన్నికలలో డబ్బులు పంచేందుకు కూడా .. టోకెన్ పద్దతి..!

token system for vote for note

ఓటర్లకు నగదు పంపిణీ మాత్రం ఎలక్షన్ కమిషన్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నిలువరించలేకపోతుంది అంటే అతిశయోక్తి కాదు. నేతల సభలు, రోడ్డు షోలకు జన సమీకరణ కోసం యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఈ విషయంలో తమిళనాడులో ఇప్పుడు మరో కొత్త పద్ధతి తెరపైకి వచ్చింది. ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ప్రచారం చేస్తే ఓ రేటు, నేతలు వచ్చినప్పుడు వారికి హారతి పడితే మరో రేటు .. ఇలాంటివి చాలా స్కీం లతో మధ్యవర్తులు తయారయ్యారు. అదేనండి ఉద్యోగాలకోసం కన్సల్టెన్సీ లు, పెళ్ళిళ్ళకి కాంట్రాక్టు తీసుకుంటారే .. అలాంటివి తయారయ్యాయి.. వీటి సేవలు ప్రస్తుతం ఆయా పార్టీలు బాగా వాడుకుంటున్నారు. ఇదే నగదు, మద్యం పంపిణీకి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. కాకపోతే ఈ కాంట్రాక్టు కాస్త ఖరీదెక్కువే మరి. సీజన్ కదా, ఆ మాత్రం చెల్లించక తప్పదు.

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కుమారుడు రవీంద్రనాథ్ థేని లోక్‌సభ స్థానం నుంచి అన్నాడీఎంకే తరపున బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే, ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని ఓ ప్రాంతానికి వచ్చిన ఆయనకు మహిళలు పెద్ద ఎత్తున హారతులతో స్వాగతం పలికారు. హారతి ఇచ్చేందుకు తీసుకొచ్చిన మహిళలకు రూ.200 చొప్పున ఇస్తామని ముందుగానే హామీ ఇచ్చారు. ఇందుకోసం ఎటువంటి పొరపాట్లు జరగకుండా హారతి ఇచ్చే మహిళలకు ముందుగానే టోకెన్ల వంటివి పంపిణీ చేశారు. కార్యక్రమం ముగిశాక.. ఆ టోకెన్లు, హారతి పళ్లాలు ఇచ్చి మహిళలు రూ.200 తీసుకోవడాన్ని కొందరు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

మొత్తానికి ఈ సీజనల్ ఉద్యోగాలు కూడా బాగానే ఉన్నాయి కదా.. అయితే దేశమే భ్రస్టుపట్టి పోతుంది. ఆ ఎవడు ఎట్టా పోతే మనకెందుకు, మనకి గడిస్తే చాలు… కదా!!

Related posts