telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

ఆకాశాన్నంటుతున్న పసిడి ధరలు… ఒక్క రోజులోనే…!?

gold and silver prices in markets

పసిడి ధర ఆకాశాన్నంటుతోంది. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర పైకి కదిలింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పెరిగింది. దీంతో ధర రూ.39,980కు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో బలమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడం బంగారం ధరపై సానుకూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదే సమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర రూ.360 పెరుగుదలతో రూ.36,650కు చేరింది. పసిడి ధర పరిగెడితే.. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.48,500 వద్దనే స్థిరంగా ఉంది. ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరుగుదలతో రూ.38,500కు చేరింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400 పెరిగింది. దీంతో ధర రూ.37,450కు పరుగులు పెట్టింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.48,500 వద్దనే స్థిరంగా ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ లేకపోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. పసిడి ధర ఔన్స్‌కు 0.10 శాతం పెరుగుదలతో 1,514.30 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.19 శాతం పెరుగుదలతో 17.84 డాలర్లకు ఎగసింది. 

Related posts