telugu navyamedia
రాశి ఫలాలు

ఈరాశి వారు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు

Today Rasi Phalalu

మేష రాశి
ఈమధ్యన ఎంతో మానసికపరమైన ఒత్తిడి కలగడంతో- విశ్రాంతి ముఖ్యమనిపించే రోజు. వినోదం, ఆటవిడుపులు మీకు సేదతీరగలవు. ఇతరులను మురిపించాలని మరీఎక్కువగా దూబరా ఖర్చు పెట్టకండి. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. రొమాన్స్ కి ఈరోజు అవకాశం లేదు. మిమ్మల్ని ద్వేషించేవారికి కేవలం “హలో” చెబితే చాలు, ఆఫీసులో అన్ని విషయాలూ ఈ రోజు మీకు ఎంతో అద్భుతంగా మారనున్నాయి. రోజులో చాలావరకు, షాపింగ్, ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంచుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.

వృషభ రాశి
రక్తపోటుగలరోగులు, దానిని తగ్గించుకోవడానికి మరియు, తమ కొలెస్ట్రాల్ ని అదుపులోఉంచుకోవడానికి, రెడ్ వైన్ ని తీసుకోగలరు . ఇది మరింతగా సేద తీరేలాగ చేస్తుంది. క్రొత్త పథకాలను, వెంచర్లను ప్రారంభించ డానికి మంచిరోజు. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కానవస్తుంది. అది, మీకు, మీకుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది. ప్రేమైక జీవితం బహు హుషారుగా వైబ్రంట్ గా ఉంటుంది. ఇత్రర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజువైపు నడిపిస్తాయి. మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక మంచి డెజర్ట్ లా మారుతుంది.

మిథున రాశి
మీ కుటుంబంతో సమయం గడుపుతూ, అందరికీ దూరంగా ఉన్నట్లు, ఒంటరినన్న భావనను వదిలిపెట్టండి. ఉమ్మడి వ్యాపారాలలోను, ఊహల ఆధారితమైన పథకాలలోను పెట్టుబడి పెట్టకండి. మీవిచ్చలవిడి ఖర్చుదారీ తనం, గల జీవన విధానం, ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది, కనుకబాగా ప్రొద్దుపోయాక తిరగడం, ఇతరులపై బోలెడు ఖర్చు చెయ్యడం , మానాలి. మీరు జీవితానికి సాఫల్యత ను సాధించబోతున్నారు, దీనికోసం మీరు, ఆనందాన్ని పంచడం, గతంలో చేసిన తప్పులను మన్నించడం చేస్తారు. మీరు ఇంతకాలంగా నిత్యం చేసేందుకు ఎదురు చూస్తూ వస్తున్న పనిని ఈ రోజు అందిపుచ్చుకోగలిగే అవకాశముంది. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే, అవి పోవడంకానీ, దొంగతనంకానీ జరగవచ్చును. ఈ రోజు పని విషయంలో మీ బాసు మిమ్మల్ని ప్రశంసించవచ్చు.

కటక రాశి
చాలాకాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. బిజినెస్ అప్పుకోసం వచ్చిన వారిని, చూడనట్లుగా వదిలెయ్యండి. కుటుంబ సభ్యులు లేదా మీ జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణమవుతారు. మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్ నిక్ కి వెళ్ళడం ద్వారా, మీ విలువైన క్షణాలలో మరల జీవించండి. ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూపోతే విజయం మీదే. బయటఊరికి ప్రయాణం మీకు సౌకర్యవంతంగా ఉండదు.- కానీ ముఖ్యమైన పరిచయాలు ఏర్పర్చడంలో ఉపకరిస్తుంది. వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూవస్తున్న ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి.

సింహరాశి
మీ జీవితాన్ని అనంత జీవన మాధుర్యం, వైభవం అంతటినీ అనుభవించడానికి సంసిద్ధం చూయండీ. ఆందోళన లేకుండా ఉండడమే ఈ దిశగా వేసే మొదటి అడుగు. వినోదం విలాసాలకు లేదా అందంపెంచుకొనే కాస్మటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చెయ్యకండి. శ్రీమతితో షాపింగ్ భలే వినోదమే. అది మీ ఇద్దరి మధ్య అర్థం చేసుకోవడాన్ని పెంపొందించింది. గత కాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి. వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం, అనుకూలమైన గాలి వీచడం వలన ఎంతో మంచిరోజు కాగలదు. మీ ప్రతిష్ఠకి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి. పెళ్లి తాలూకు చక్కని కోణాన్ని అనుభూతి చెందేందుకు ఇది చక్కని రోజు.

కన్యా రాశి
స్నేహితులు, మీకు సపోర్టివ్ గా ఉండి, మీకు సంతోషాన్ని కలిగిస్తారు. ఆర్థిక ప్రయోజన ఆలోచనలు గల అత్యంత తెలివినిండిన వాటిని ముందుకు తెస్తారు. మీ కుటుంబసభ్యుల అవసరాలను తీరచడమే ఇవాళ్టి మీ ప్రాధాన్యత. ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి, మనసుకు నచ్చుతారు. మీరు చేసిన మంచి పనులకు ఆఫీసులో అంతా మిమ్మల్ని ఈ రోజు గుర్తిస్తారు. మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజంభుజం కలిపి మసులుతూ ఉండాలి. మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్. ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు.

తులా రాశి
మీ ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చిపడడంతో, మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి. వారి విచారాలు, సంతోషాలలో మీరు పాలుపంచుకుంటారని వారు గుర్తిస్తారు. రొమాన్స్- అనేది మీ ప్రియమైన వ్యక్తి డిమాండ్ వలన వెనుక సీటుకు నెట్టివేయబడుతుంది. పనిచేసే చోట మీతెలివితేటలను, లౌక్యాన్ని, దౌత్యాన్ని వాడాల్సిఉన్నది మీరు మనసులో ఏమనుకుంటున్నారో దానిని చెప్పడానికి భయపడకండి. ఈ రో జు మీరు మీ జీవిత భాగస్వామిని రొమాంటిక్ డేట్ కు తీసుకెళ్తే, అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

వృశ్చికరాశి
మీ సంతోషాన్ని భయం చంపెయ్యగలదు. అది మీలో స్వంతంగా పుట్టే ఆలోచనల వలన, ఊహలవలన ఉత్పన్నమయ్యాయని అర్థం చేసుకోవాల్సి ఉన్నది. అది మీ ధారాళత శక్తిని, జీవించడంలోని ఆనందాన్ని, పారిపోయేలా చేస్తాయి. మీ సామర్థ్యాన్ని పనికి రాకుండా చేతగానితనంగా మార్చెస్తుంది. కనుక మొగ్గదశలోనే దానిని త్రుంచివెయ్యండి, లేకపోతే అది మిమ్మల్ని పిరికివారిగా తయారుచేస్తుంది. రియల్ ఎస్టేట్ లో తగినంతగా సొమ్మును మదుపు చెయ్యాలి. పిల్లలకు తమ భవిష్యత్తుకై పాటుపడకుండా బయట పెత్తనాలకు ఎక్కువసమయం గడపడంతో, కొంతవరకు నిరాశకు కారణం కాగలరు. మీ అంకితమైన తిరుగులేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తిఉన్నది. మీరు ఒక మంచి, పెద్ద పనిలో భాగమవుతారు, అది మీకు ప్రశంసలు, రివార్డ్ లు తెచ్చిపెడుతుంది. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘ కాలంలో ఫలవంతం కాగలదు. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్ట్ ఈవ్ గా సాక్షాత్కరించడం ఖాయం.

ధనుస్సు రాశి
ఆరోగ్యం చక్కగా ఉంటుంది. త్వరగా డబ్బును సంపాదించెయ్యాలని మీకు కోరిక కలుగుతుంది. మీకు స్నేహితులతో గడపడానికి సమయం లభించించుతుంది, డ్రైవింగ్ చేసేటప్పుడు, అదనంగా జాగ్రత్తలు తీసుకొండి. మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం. మీ సృజనాత్మకత పోయిందని, మీరు నిర్ణయాలేవ్ ఈ తీసుకోలేననీ అది చాలా కష్టమని భావిస్తారు. ఉబుసుపోక కల్పితాలకి, అపవాదులు, రూమర్లకి దూరంగా ఉండండి. వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈ రోజు మీకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది.

మకర రాశి
మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే, జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి/చెడు ఏదైనా మనసుద్వారానేకదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు. ప్రకాశింపచేయగలదు. అన్ని ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. మీకు సహాయపడేందుకు ప్రయత్నించగలరు గలరు అనుకునే పెద్దమనుషులకి, మీ ఆకాంక్షల గురించి తెలియచేయండి. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి. వివాదాలు, ఆఫీసు రాజకీయాల వంటివాటిని మర్చిపోండి. ఈ రోజు ఆఫీసులో మీదే రాజ్యం! మీ ప్రతిష్ఠకి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి. ఈ రోజు మీ జీవితంలో వసంతం వంటిది. ఫుల్ రొమాన్స్. మీరు, మీ జీవిత భాగస్వామి. అంతే.

కుంభరాశి
మీకు పన్నునొప్పికానీ పొట్ట అప్సెట్ అవడం కానీ ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. సత్వర బాధా నివృత్తికోసం ఒక డాక్టరును సంప్రదించండి. ఖర్చు పెరుగుతుంది, అలాగే ఆదాయం మీబిల్లుల గురించి జాగ్రత్త తీసుకుంటుంది. ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజు గా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు. వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగాను ప్రమాదకరంగాను ఉంటాయి. మిమ్మల్ని ద్వేషించేవారికి కేవలం “హలో” చెబితే చాలు, ఆఫీసులో అన్ని విషయాలూ ఈ రోజు మీకు ఎంతో అద్భుతంగా మారనున్నాయి. మీకు అనుకూలమైన గ్రహాలు, ఈరోజు మీ సంతోషానికి, ఎన్నెన్నో కారణాలను చూపగలవు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవపడవచ్చు.

మీన రాశి
మీ ఖర్చుదారీతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి.- అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరినీ మరియు ఎవరి లక్ష్యాలను గురించి, అంత త్వరగా అంచనాకు వచ్చెయ్యకండి- వారు ఏదైనా వత్తిడిలో ఉండి ఉండవచ్చును, మీ సానుభూతిని కోరడం, అర్థం చేసుకుంటారని ఆశించి ఉండవచ్చును. మీ మూడీ ప్రవర్తన, మీ సోదరుని మూడ్ ని పాడుచేయవచ్చును. ప్రేమబంధం కొనసాగడానికి పరస్పరం గౌరవం, నమ్మకం పెంపొందించుకోవాలి. ఈ రోజు విశ్రాంతికి చాలా తక్కువ సమయం ఉంటుంది- ఏమంటే, మీరు పెండింగ్ పనులు పూర్తి చెయ్యడం లో లీనమైపోతారు. మీ సమాచార,పని నైపుణ్యాలు, ప్రశంసనీయం గా ఉంటాయి. ఈ రో జు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తల్లకిందులు కావచ్చు జాగ్రత్త.

Related posts