telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు విద్యా వార్తలు

పది ఫలితాలు .. నేడే, ..ఇంటర్ ఫలితాల తరహా కొనసాగుతుందా.. !

today telanagana tenth results

నేడు తెలంగాణాలో పదోతరగతి పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 11.30 గంటలకు సచివాలయం ‘డీ’బ్లాక్‌ సమావేశ మందిరంలో నిర్వహించే కార్యక్రమంలో ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 5 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఫలితాలను ‌www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి పొందాలని సూచించారు. ఫలితాలపై ఫిర్యాదుల కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక యాప్‌ TSSSCBOARD అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. వెబ్‌సైట్లో ప్రత్యేకంగా స్కూల్‌ లాగిన్‌ ఏర్పాటు చేశామని, దీని ద్వారా పాఠశాల విద్యార్థుల ఫలితాలు తెలుసుకునేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. ఫలితాలు‌ www.eenadu.net, www.eenadupratibha.net వెబ్‌సైట్లలోనూ అందుబాటులో ఉంటాయి.

యాప్‌ కోసం ఇలా :
* యాప్‌ను వెబ్‌సైట్‌ ద్వారా గానీ, ప్లేస్టోర్‌లో గానీ ‘టీఎస్‌ఎస్‌ఎస్‌సీబోర్డ్‌ యాప్‌’ అని టైప్‌చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
* యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నాక హాల్‌టికెట్‌ నంబరు, పుట్టినతేదీ నమోదు చేసి లాగిన్‌ కావాలి.
* లాగిన్‌ అయ్యాక విద్యార్థి పేరు, పాఠశాల వివరాలు, హాల్‌టికెట్‌ నంబరు కనిపిస్తుంది. ఫిర్యాదు నమోదు చేసేందుకు మొబైల్‌నెంబరు, ఈ-మెయిల్‌ ఐడీ నమోదు చేయాలి.
* ఫిర్యాదు విభాగంలో ఫిర్యాదు రకాన్ని ఎంచుకుని, ఫిర్యాదును నమోదు చేసి సబ్‌మిట్‌ చేయాలి.
* ఫిర్యాదు బోర్డుకు అందిన వెంటనే మొబైల్‌ నెంబరు, ఈ-మెయిల్‌ ఐడీకి సమాచారం వస్తుంది. ఫిర్యాదు ఒకేసారి చేయడానికి అవకాశముంటుంది.

Related posts