telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : .. పనులు విజయవంతం అవుతాయి.. మనశాంతి లభిస్తుంది..

today rasi falalu

మేషం : ఈ రోజు మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. అలాగే కొత్తగా ఏదైనా పని ప్రారంభించటానికి కూడా అనువైన రోజు. గృహానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు.అనుకోని బహుమతి కానీ, ప్రశంసను కానీ పొందుతారు. ఉద్యోగం మార్పు విషయంలో మీరు ఎదురు చూస్తున్న ఫలితం దక్కుతుంది.

వృషభం : ఈ రోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. రోజువారీపనుల నుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఏదైనా దూరప్రదేశానికికానీ, ఆధ్యాత్మికకేంద్రానికి కాని వెళ్లి ప్రశాంతంగా గడపాలిఅన్న ఆలోచనను కలిగి ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలమైన రోజు కాదు. అలాగే ప్రయాణాల్లో కొంత ఇబ్బందికి లోనవుతారు.

మిథునం : ఈ రోజు ఒక సంఘటన మీమనసు చెదిరిపోయేలా చేస్తుంది. అనవసర వివాదం కానీ, ఆర్థిక నష్టం కానీ జరిగే అవకాశముంటుంది. ముఖ్యంగా ఆవేశానికిలోను కాకుండా మీపనులు చేసుకోవటం మంచిది. మాట విషయంలో జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు అంతగా అనువైన రోజు కాదు. మీ తల్లి గారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కర్కాటకం : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీజీవిత భాగస్వామికికానీ, మీరుప్రేమించిన వ్యక్తిని కానీ మీప్రేమను వ్యక్తపరుస్తారు. అలాగే వివాహ సంబంధాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి. ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. ప్రయాణాలకు అనుకూలదినం.

సింహం : ఈ రోజు ఆర్థికంగా బాగుటుంది. రావలసిన బకాయిలు వసూలవుతాయి. వివాదాల్లోకానీ, కోర్టుకేసుల్లో కానీ విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అభివృద్ధిసాధిస్తారు. అలాగే స్నేహితుల నుంచి అనుకోని సాయం అందుతుంది. లోను కొరకు లేదా ఆర్థిక సాయం కోరకు ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు అనుకూల ఫలితం ఉంటుంది.

కన్య : మీరు ఇష్టపడిన వారికి మీప్రేమను వ్యక్తం చేయటానికి, స్నేహితులతో ఉన్న వివాదాలను తొలగిచుకోవటానికి అనుకూలదినం. మిత్రుల నుంచి సహాయం ఆశిస్తున్న వారికి వారు అనుకున్న సాయం అందుతుంది. సం తానం గురించి ఎదురుచూస్తున్న వారికి అనుకూల ఫలితం దక్కుతుంది.

తుల : ఈ రోజుపని మీద ఎక్కువగాధ్యాస ఉండదు. ఇంట్లో విశ్రాంతితీసుకోవాలి, కుటుంబ సభ్యులతో గడపాలి అనే ఆలోచన అధికంగా ఉంటుంది. విద్యాసంబంధ వ్యవహారాలకు, భూ, గృహసంబంధవ్యవహారాలకు అనుకూలదినం. భూమి లేదా వాహనం కొనుగోలు చేయదలచినవారు ఈ రోజు తీసుకోవచ్చు.

వృశ్చికం : ఈ రోజు వ్యాపార వ్యవహారాలకు, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలంగాఉంటుంది. ప్రయాణంచేసే అవకాశం ఉంది. అలాగే విదేశం నుంచి ఒకముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్తపరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. మీభావోద్వేగాలను అదుపులోపెట్టుకోవటం మంచిది. ఉద్యోగంలోమార్పుకానీ, బదిలీ కానీ ఉంటుంది.

ధనుస్సు : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా కాకపోయేసరికి కొంతనిరాశకు లోనవుతారు. ఇతరులతోవ్యవహరించేప్పుడు కొంతజాగ్రత్త అవసరం, లేనిచోఅవమానాలపాలవుతారు. ఇంటికిసంబంధించి ఏదైనావస్తువుకొనటంకాని, బాగుచేయించటంకానీచేస్తారు. ఖర్చుఅదుపులో ఉండదు.

మకరం : ఈ రోజు ఆనందంగా గడుపుతారు. రుచికరమైన ఆహారం, మిత్రులతో లేదా కుటుంబసభ్యులతోవిహారం చేస్తారు. దుస్తులు కానీ, మీకు సంబంధించిన వస్తువులుకానీ కొనుగోలుచేస్తారు. మీ జీవితభాగస్వామితోకలిసి సినిమా లేదా ఇతరవినోద కార్యక్రమానికి హాజరవుతారు. మీ అలవాట్లను అదుపులోఉంచుకోవటం మంచిది.

కుంభం : ఈ రోజుకొంత బద్ధకంగా ఉంటుంది. చిన్నపనికి అయినా ఇతరులపై ఆధారపడటంకానీ, ఇతరుల సాయంతీసుకోవటం కానీ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలోఅనుకోనిసమస్యకారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగేమిత్రులతోఅభిప్రాయభేదాలు ఏర్పడే అవకాశముంటుంది. అనవసర ఖర్చులుంటాయి.

మీనం : ఈ రోజు ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు గడిస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. అలాగే కొత్తస్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. కాబట్టి తొందర పాటుమంచిది కాదు.

Related posts