telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు సామాజిక

రాశిఫలాలు : … విదేశీయానం, ఆర్థికవిషయాలు అనుకూలం …

today rasi falalu

మేషం : ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.

వృషభం : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు, ప్రయాణాలు కానీ చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బుకానీ, విలువైన వస్తువులు పోగొట్టుకోకుండా జాగ్రత్త వహించాలి.

మిథునం : ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావడం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సాయం అందడం జరుగుతుంది. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.

కర్కాటకం : ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి, స్థిరాస్తి సంబంధ వ్యవహారాలకు, పైఅధికారులను కలవడానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

సింహం : ఈ రోజు మీరు దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్రదర్శనం చేసుకుంటారు.

కన్య : ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడుతాయి. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. నూతన వ్యాపారానికి, ఆర్థిక లావాదేవీలకు అనుకూలదినం కాదు.

తుల : ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. బంధువులను కలుసుకోవడం, చిరకాల మిత్రులను కలుసుకోవడం కానీ చేస్తారు. ప్రేమ లేదా పెళ్లికి సంబంధించిన వ్యవహారాల్లో కొంత అనుకూలత ఏర్పడుతుంది. కొత్త వస్ర్తాలను, వస్తువులను కానీ కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం : ఈ రోజు ఇంటి వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో ఏదైనా సమస్య, మాట పట్టింపు వచ్చే అవకాశముంటుంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మానసిక ఆందోళన, అనవసర ఆవేశం ఎక్కువగా ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ పూర్తి చేయగలుగుతారు.

ధనుస్సు : ఈ రోజు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. అనుకున్న పనులు ఎక్కువ శ్రమ లేకుండా పూర్తి చేస్తారు. మిత్రులకు, బంధువులకు సాయం చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టడం కానీ, లేదా ఖర్చు ఎక్కువగా ఉండటం జరుగుతుంది. మీ సంతా నం అభివృద్ధిలోకి వస్తారు.

మకరం : ఈ రోజు ఎక్కువగా ఇంట్లో గడపడానికి కానీ, కుటుంబ సభ్యులతో గడపటానికి ఇష్టపడతారు. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగంలో అభివృద్ధి లభిస్తుంది. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.

కుంభం : ఈ రోజు ప్రయాణాల్లో కొంత జాగ్రత్త అవసరం. స్త్రీల కారణంగా ఇబ్బందులకు గురయ్యే అవకాశముంటుంది. విలువైన వస్తువులు ప్రయాణాల్లో తీసుకెళ్లక పోవడం మంచిది. గృహ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఎక్కువ ఆవేశానికి, అత్యుత్సాహానికి లోనవకండి.

మీనం : ఈ రోజు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. తొందరపడి మాట అని తర్వాత బాధ పడే అవకాశముంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా ధన లాభం కలుగుతుంది. మానసికంగా కొంత ఒత్తిడి ఉం టుంది. ఆవేశానికి లోనవకండి.

Related posts