telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : … ప్రేమవ్యవహారాలలో .. ఆర్థికంగానూ అనుకూలిస్తాయి..

today rasi falalu

మేషం : ఈ రోజు ఇంటిపట్టున ఉండి చాలా రోజుల నుంచి వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధువులను, స్నేహితులను కలుసుకుంటారు. ఇల్లు లేదా భూ సంబంధ లావాదేవీలు పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా కొంత సామాన్యంగా ఉంటుంది.

వృషభం : ఈ రోజు వ్యాపార వ్యవహారాలకు, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలాగే విదేశం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడుతాయి. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం మంచిది. ఉద్యోగంలో మార్పుకానీ, ట్రాన్స్‌ఫర్‌ కానీ ఉంటుంది.

మిథునం : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం, లేనిచో అవమానాల పాలవుతారు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనడం కాని, బాగు చేయించటం కానీ చేస్తారు. ఖర్చు అదుపులో ఉండదు కాబట్టి తొందరపాటు మంచిది కాదు.

కర్కాటకం : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవడం కానీ, నూతన వస్ర్తాలు కొనుగోలు చేయడం కానీ చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండడం మంచిది. మీ జీవిత బాగస్వామి నుంచి అనుకోని సహాయం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగువుతుంది. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ఆచి, తూచి అడుగేయండి.

సింహం : ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికి అయినా ఇతరులపై ఆధారపడడం కానీ, ఇతరుల సాయం తీసుకోవడం కానీ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ బేధాలు ఏర్పడే అవకాశముంటుంది. అనవసర ఖర్చులుంటాయి.

కన్య : ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకోని ధనాదాయం ఉంటుంది. మీ స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. చాలా కాలం నుంచి ఎంత ప్రయత్నం చేసినా కాని పనులు ఈ రోజు ఏ ప్రయత్నం లేకుండానే పూర్తవుతాయి. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

తుల : ఈ రోజు మీరు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పు ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మీ పై అధికారులనుంచి అనుకోని బహుమతి అందుకుంటారు. మీ సంతానం కారణంగా మీరు ఆనందాన్ని, గుర్తింపును పొందుతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

వృశ్చికం : ఈ రోజు మీరు రోజువారీ కార్యక్రమాల నుంచి విశ్రాంతిని కోరుకుంటారు. ఒకే రకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. అనుకోని ప్రయాణం కానీ, కొత్త వ్యక్తులను కలుసుకోవడం కానీ జరుగుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మార్పు కోరుకుంటారు.

ధనుస్సు : ఈ రోజు చేపట్టిన పనుల్లో అనుకోని అడ్డంకుల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఆవేశానికి లోనవకుండా స్థిమితంగా ఉండడం మంచిది. ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులకు, కొనుగోళ్లకు అనుకూమైన రోజు కాదు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఎదుటివారిని నమ్మి డబ్బులు ఇవ్వకండి.

మకరం : వివాహ సంబంధ వ్యవహారాలకు, ఒప్పందాలకు అనుకూల దినం. మీ మనసులోని భావాలను మీ జీవితభాగస్వామికి వ్యక్తం చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి సినిమా లేదా ఇతర వినోద కార్యక్రమాలకు వెళ్తారు. బంధువులతో లేదా మిత్రులతో ఉన్న గొడవలు సమసిపోతాయి.

కుంభం : ఆర్థికంగా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రావలసిన పాత బకాయిలు రావడం కాని, లోన్‌ రావడం కానీ జరుగుతుంది. ఉద్యోగం విషయంలో ఎదురు చూస్తున్న వారికి కొంత అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాపార విషయాలకు కొంత సామాన్యంగా ఉంటుంది. కోర్టు కోసులు, వివాదాల్లో విజయం సాధిస్తారు.

మీనం : ఈ రోజు ప్రేమను లేదా మీ అభిప్రాయాన్ని వ్యక్తపర్చడానికి అనుకూలంగా ఉంటుంది. మానసికంగా కొంత ఆందోళన, ఉత్సాహం కలగలుపుగా ఉంటాయి. మీ సంతానం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు, ఆర్థిక లావాదేవీలకు అంతగా అనుకూలమైన రోజు కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పోటీ పరీక్షలు రాసే వారు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది.

Related posts