telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు సామాజిక

రాశిఫలాలు : … ప్రతిభకు గుర్తింపు.. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి..

today rasi falalu

మేషం : కొత్తవారితో పరిచయం కానీ లేదా విదేశీయానానికి సంబంధించి ముఖ్య సమాచారం కానీ అందుకుంటారు. మానసికంగా ఆందోళనకు గురవుతారు. ఏదో తెలియని భయాన్ని అనుభవిస్తారు. మీతండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగర్త అవసరం. ఊహించని ఖర్చులు ఉంటాయి.

వృషభం : ఈ రోజు ప్రతిపనిలో, రోజువారి జీవితంలో ఏదో ఒక ఇబ్బందిని, అడ్డంకులను ఎదుర్కొంటారు. గొడవలు, అవమానానికి గురవటం లేదా వివాదాల్లో ఇరుక్కోవటం జరగవచ్చు. ఇతరుల వ్యవహారాల్లో కల్సించుకోకండి. మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా పనులు చేస్తే విజయం వరిస్తుంది. పెట్టుబడులకు అనుకూలంకాదు. ఖర్చులు అధికంగా ఉంటాయి.

మిథునం : ఈ రోజుమీమిత్రులను కలుసుకోవటం జరుగుతుంది. అలాగేప్రయాణంలో అనుకోని లాభం కలుగుతుంది. బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. మంచి రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. ధనలాభం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూల ఫలితం పొందుతారు.

కర్కాటకం : ఈ రోజు ఉద్యోగ విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ ఒకముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీ, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్యవిషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటంకానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం కానీ మంచిదికాదు.

సింహం : మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తికాకపోవటం లేదాఅనుకోని అడ్డంకులు రావటం వలన మానసికంగా చికాకుకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక వ్యవహారాలకు అనుకూలదినం కాదు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకుని అవమానం పాలవకండి.

కన్య : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదరలేదాఛాతి సంబంధసమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీకుటుంబసభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడామీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలోజాగ్రత్త అవసరం.

తుల : ఈ రోజు మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచితనిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటంకానీ, వారికోపానికి గురవటం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పనివిషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీబంధువులలోఒకరి నుంచి అనుకోని సాయాన్నిపొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

వృశ్చికం : ఈ రోజు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీమాటతీరుకానీ, వ్యవహారశైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లోతలదూర్చకండి, దానికారణంగా మీఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటు చేసుకోవచ్చు.

ధనుస్సు : మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగాఉల్లాసంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువసేపు ఇంటిలోఉండాలని, కుటుంబసభ్యులతో గడపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.

మకరం : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ ప్రయాణాలు కానీ చేయవలసివస్తుంది. మానసికంగా
ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తఅవసరం. డబ్బుకానీ, విలువైనవస్తువులుకానీ పోగొట్టుకోకుండా చూసుకొండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

కుంభం : ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగాపూర్తిచేయగలుగుతారు. ఉద్యోగంలోకానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లలగురించి శుభవార్త వింటారు.

మీనం : ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలుఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలోమార్పు గురించి కానీ మీరుచేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులనుకలవటానికి అనుకూలదినం. మీప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

Related posts