telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు సామాజిక

రాశిఫలాలు : .. ఆర్థికంగా అనుకూలంగా.. విందులువినోదాలతో కోలాహలంగా..

today rasi falalu

మేషం
ఈ రోజు చాలాకాలం నుంచి వాయిదా పడుతున్న పనులు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. అలాగే ఉద్యోగంలో మీపనికి మంచి గుర్తింపు వస్తుంది. ప్రయాణాలకు సాధారణ దినం.

వృషభం
ఈ రోజు డబ్బు విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించకపోవటం కానీ, పెట్టుబడులకారణంగా నష్టపోవటం కానీ జరగవచ్చు. ఆర్థికవ్యవహారాల్లో జాగ్రత్తఅవసరం. వ్యాపార లావాదేవీలకు అనువైనదినం కాదు.

మిథునం
ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబసభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

కర్కాటకం
ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలించే దినం. రావలసిన బకాయిలు రావటమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకోని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం కానీ వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు.

సింహం
ఈ రోజు చేపట్టిన పనులు వాయిదాపడటం కానీ, అనుకోనిఅడ్డంకులు రావటం కానీ జరగవచ్చు. ఇది తాత్కాలికమే గనుక పట్టువదలక ప్రయత్నించండి. విజయం మీ సొంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది.

కన్య
ఈ రోజు దూర ప్రదేశం నుంచి ఒకశుభవార్త వింటారు. మీరుచేసిన పనికి మంచిగుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు.

తుల
ఈ రోజు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధమైన సమస్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయకండి.

వృశ్చికం
ఈ రోజు మీకు ఆనందంగా, లాభదాయకంగా ఉంటుంది. అనుకోని మిత్రులను కలవటం, వారితో రోజును ఆనందంగా గడపటం చేస్తారు. అలాగే మీ కుటుంబసభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభంవస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

ధనుస్సు
ఈ రోజు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరటం, లక్ష్యానికి చేరువవటం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

మకరం
ఈ రోజు ప్రయాణం చేసే అవకాశం అధికంగా ఉంటుంది. ఆరోగ్యవిషయంలో జాగ్రత ్తఅవసరం. ఉదర, ఛాతికి సంబంధించిన నొప్పితో ఇబ్బందిపడే అవకాశముంది. నిద్రలేమితో రోజంతా అసౌకర్యంగా ఉంటుంది. మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్రదర్శనం చేసే అవకాశముంది.

కుంభం
ఈ రోజు మీ సహోద్యోగులతో, పై ధికారులతో కొంత సామరస్యపూర్వకంగా ప్రవర్తించటం మంచిది. అనుకోని ఆవేశం కారణంగావారితో గొడవ జరిగే అవకాశముంటుంది. ప్రయాణంలో అనవసరమైన చిక్కుల్లో ఇరుక్కునే అవకాశముంది. జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు, భూ, గృహ సంబంధ ఒప్పందాలకు అనువైనరోజు కాదు.

మీనం
ఈ రోజు మీ దాంపత్య జీవితం ఆనందమయంగా ఉంటుంది. వివాదాలు సమసిపోతాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో కానీ, శుభకార్యాల్లో కానీ పాల్గొంటారు. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టడం కానీ, నూతన వ్యాపార ఒప్పందాలు ఏర్పరచుకోవటం కానీ చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

Related posts