telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు సామాజిక

రాశిఫలాలు : .. మాటతీరుతో.. ఇంటాబయటా అపార్దాలకు తావిచ్చినట్టే.. జాగర్త!

today rasi falalu

మేషం : ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చుల కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది. అలాగే విలువైన వస్తువుల విషయంలో, నగల విషయంలోజాగ్రత్త అవసరం. అజాగ్రత్తగా ఉండకండి.

వృషభం : ఈ రోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి.

మిథునం : ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కాని అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ గానీ, అనుకున్న మార్పు కానీ చోటుచేసుకుంటుంది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూల దినం. అలాగే పై అధికారులతో మీ సంబంధాలు మెరుగవుతాయి.

కర్కాటకం : పాత మిత్రులను కానీ, దూరదేశంలో ఉన్న మిత్రులను కానీ కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. మీరుఅనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది. అలసట, ఒత్తిడి అధికంగా ఉంటాయి.

సింహం : ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. చేపట్టిన పనులు, ప్రయాణాలు వాయిదాపడతాయి. అనవసర ఖర్చుపైన పడుతుంది. ఇతరుల వ్యవహారాలో ్లజోక్యం చేసుకోకండి. పెట్టుబడులకు అనువైన రోజుకాదు.

కన్య : స్నేహితులతో, జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. రుచికరమైన ఆహారం, వినోద కార్యక్రమాలతో రోజు గడుపుతారు. అలాగే వాహనం కొనుగోలు కానీ, భూ సంబంధ వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి వస్తాయి. వినోద యాత్ర చేస్తారు.

తుల : ఈ రోజు గృహ సంబంధ వ్యవహారాలో ్లమునిగి తేలుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనటం కానీ, వాహనం కొనుగోలు చేయటం కానీ చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అత్యుత్సాహానికి పోకండి.

వృశ్చికం : మీరు ఎంతో ఇష్టంతో చేపట్టిన పని వాయిదాపడటం, అలాగేసాయం చేస్తానన్న వారు కూడా సమయానికి మాట మార్చటంతో మానసికంగా ఆందోళనకు, అసహనానికి గురవుతారు. పెట్టుబడులకు, పోటీలకు అనువైన రోజుకాదు. మానసిక ప్రశాంతత కోసం పిల్లలతో గడపటంకానీ, వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ చేయటం మంచిది.

ధనుస్సు : ఆరోగ్య విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపునొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధపడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం కూడా మీకుఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

మకరం : అజాగ్రత్త, అనాలోచిత ప్రవర్తన కారణంగా మీ బంధువులను అసహనానికి గురిచేసిన వారవుతారు. వారి నమ్మకాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడండి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి అలాగే ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కుంభం : ఇతరులతో మాట్లాడేప్పుడు కొంత జాగ్రత్త అవసరం. మీ మాటతీరు కారణంగా అనవసరపు వివాదాలు తలెత్తే అవకాశముంటుంది. అలాగే ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. ఆ సమస్య మీకు చుట్టుకుంటుంది. మానసికంగా దృఢంగా ఉండటం మంచిది. దాని వల్ల మీ ప్రతిష్టకు భంగం కలగకుండా ఉంటుంది.

మీనం : స్నేహితులతో, పరిచయస్తులతో గడపటానికి అనువైన సమయమిది.అలాగే మీ జీవితభాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. మీ మధ్య ఉన్న మనస్పర్దలు తొలగిపోతాయి. మీ ప్రేమ వ్యవహారాల్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

Related posts