telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు సామాజిక

రాశిఫలాలు : .. ఇతరుల ఒత్తిడితో.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు..

today rasi falalu

మేషం : ఈ రోజు మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం లేదా అనుకోని అడ్డంకులు రావటం వల్ల మానసికంగా చికాకుకు, కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు.

వృషభం : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

మిథునం : ఈ రోజు మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువుల్లో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కర్కాటకం : ఈ రోజు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాట తీరు కానీ, వ్యవహార శైలి కానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు.

సింహం : ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు రావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.

కన్య : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కాని ప్రయాణాలు కాని చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు కానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

తుల : ఈ రోజు బంధువులను లేదా మిత్రులను కలుస్తారు. ముఖ్యంగా మీరు బాగా ఇష్టపడే వ్యక్తులను కలుస్తారు. మానసికంగా ఉల్లాసంగా గడుపుతారు. అనుకోని ఆదాయం కాని, బహుమతి కానీ అందుకుంటారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పాత బకాయిలు తిరిగి రావటం కాని, అనుకోని ఆదాయం రావటం కానీ జరుగుతుంది.

వృశ్చికం : ఈ రోజు మీ వ్యాపారం లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవడానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

ధనుస్సు : ఈ రోజు ఉద్యోగానికి సంబంధించి అనుకూల మార్పులు ఉంటాయి. మిత్రులతో కలిసి ప్రయాణం చేయటం కానీ, ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కానీ చేస్తారు. విదేశీయానానికి సంబంధించిన పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక స్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. గృహ సంబంధ ఒప్పందాలు చేసుకుంటారు. రోజంతా ఉత్సాహంగా గడుపుతారు.

మకరం : ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. నూతన వ్యాపారానికి, ఆర్థిక లావాదేవీలకు అనుకూలదినం కాదు.

కుంభం : ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. మిత్రులను, బంధువులను కలుస్తారు. ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు. భూమి లేదా వాహన సంబంధ ఒప్పందాలు, కొలుగోలు చేస్తారు. వ్యాపారంలో మార్పు కాని, భాగస్వామ్య ఒప్పందాలు కాని చేస్తారు. ఉద్యోగంలో అనుకోని మార్పు ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మీనం : ఈ రోజు ఉద్యోగ విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీల ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం కానీ మంచిది కాదు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

Related posts