telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : .. ఆకస్మిక ప్రయాణాలు.. ఆలయాల సందర్శన..

today rasi falalu

మేషం : చేపట్టిన పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు అంతంత మాత్రమే. ఉద్యోగాలలో చికాకులు.

వృషభం : కొత్త పనులు ప్రారంభిస్తారు. దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. భూవివాదాలు పరిష్కారం. దైవదర్శనాలు. వ్యాపారాలలో మరింత పురోగతి. ఉద్యోగాలలో ఉన్నతి.

మిథునం : విద్యార్థులకు నూతనోత్సాహం. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలలో మరింత లాభాలు. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి. దైవచింతన.

కర్కాటకం : సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. ఉద్యోగ యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు.

సింహం : వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలు భారంగా ఉంటాయి.

కన్య : ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. వస్తులాభాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

తుల : పనుల్లో అవాంతరాలు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్యభంగం. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తుంది. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

వృశ్చికం : మీ నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

ధనుస్సు : పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. రుణాలు చేస్తారు. అనారోగ్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు.

మకరం : ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ధనప్రాప్తి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కుంభం : ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి వృద్ధి. వివాహయత్నాలు సానుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మీనం : మిత్రులు, శ్రేయోభిలాషులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు పనిఒత్తిడులు.

Related posts