telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు సామాజిక

రాశిఫలాలు : .. అన్నివిధాలా అనుకూలించే రోజు..

today rasi falalu

మేషం : ఈ రోజు స్నేహితులు లేదా బంధువులను కలుసుకుంటారు. కొత్త స్నేహాలు పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కానీ, ప్రయాణం కానీ చేస్తారు. విదేశీ ప్రయాణానికి సంబంధించిన ఒక ముఖ్య సమాచారం తెలుస్తుంది. తలపెట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. చర్చలు సఫలం అవుతాయి.

వృషభం : ఈ రోజు వాయిదా పడుతున్న పనులు పూర్తి చేసేందుకు అనుకూల సమయం. పై అధికారులను కలవడానికి అలాగే ముఖ్యమైన ఒప్పందాలకు కూడా అనుకూలించే దినం. అనుకోని బహుమతులు కాని, ప్రశంసలు కాని పొందుతారు. మీ మిత్రులు లేదా బంధువుల సహాయం అందుకుంటారు. అనుకోని వ్యక్తులను కలుసుకుంటారు.

మిథునం : ఈ రోజు రోజు వారీ పనుల నుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. గురువులను లేదా ఆధ్యాత్మికవేత్తలను కలుస్తారు. ప్రయాణంలో అడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు. ఇంట్లోకి కొత్తవస్తువులు కొనడం కానీ, ఇల్లు సర్దడం కానీ చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

కర్కాటకం : ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒక సంఘటన కారణంగా మీ మనసు చెదురుతుంది. ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలైన భయం ఈ రోజు సూచించబడుతాయి. మీ ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. శివున్ని పూజించండి.

సింహం : ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవడానికి, ఒప్పందాలను, అంగీకారాలను కుదుర్చుకోవడానికి అనుకూల దినం. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. మీ ప్రేమను, పిల్లల ఆరోగ్య విషయంగా లేదా విద్యా విషయంగా కొంత ఆందోళన చెందుతారు.

కన్య : ఈ రోజు వివాదాలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా భూమి సంబంధ వివాదాలు పరిష్కరించుకోవడానికి అనుకూల దినం. మీ మాట నెగ్గుతుంది. అనుకూల ఫలితం పొందుతారు. ఆర్థిక లాభాలుంటాయి. జీవిత భాగస్వామి అనారోగ్యం కొంత ఆందోళనకు కారణమవుతుంది. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి.

తుల : మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే మీ ప్రేమను మీరు ప్రేమించిన వ్యక్తికి చెప్పడానికి అనుకూల దినం. మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, తెలియని చిన్న ఆందోళన మనసులో ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది.

వృశ్చికం : ఈ రోజు ఇంట్లో ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. సెలవైనప్పటికీ బయటకెళ్లటంకంటే ఇంట్లో కుటుంబసభ్యులతో గడపాలని కోరుకుంటారు. గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. బంధువులను కలుసుకుంటారు. రావాల్సిన డబ్బు చేతికందుతుంది.

ధనుస్సు : ఈ రోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. షాపింగ్ చేయడం కాని, మిత్రులను కలవడం కానీ చేస్తారు. అలాగే వాహన కొనుగోలు కానీ, రిపేర్ చేయించడం కానీ చేస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. అత్యుత్సాహం కారణంగా అనుకోని గొడవల్లో ఇరుక్కునే అవకాశముంటుంది.

మకరం : ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాతబాకీలు వసూలయినప్పటికీ, ఇందుకు తగిన ఖర్చుపైన పడటంతో వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది. పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అనువైన రోజు కాదు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల కారణంగా కూడా డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది.

కుంభం : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. రుచికరమైన ఆహారం లభిస్తుంది. మిత్రులు, బంధువులతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు. అనుకున్న పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది. అనుకోని ధనలాభం కలుగుతుంది. కుటుంబసభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు.

మీనం : ఈ రోజు కొంత బద్ధకంగా గడుపుతారు. ఏ పని చేయడానికి ముందుకురారు. దానికి కారణంగా కుటుంబసభ్యుల కోపానికి గురవుతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. మీ మిత్రులతో కానీ, దగ్గరి బంధువులతో కాని వివాదం జరగడం లేదా వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం జరుగవచ్చు. భూ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు. మీ తల్లి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.మేషం

Related posts