telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : .. వ్యవహారాలలో విజయం.. ఉద్యోగంలో సంతృప్తి..

today rasi falalu

మేషం : పనులు నిదానిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

వృషభం : సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులలో పురోగతి. శుభకార్యాలు నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మిథునం : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కర్కాటకం : వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

సింహం : పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కన్య : రుణభారాలు తొలగుతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల : నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృశ్చికం : పనులు నత్తనడకన సాగుతాయి. ధనవ్యయం. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

ధనుస్సు : ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం : మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వేడుకల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం : కొన్ని పనులు వాయిదా వేస్తారు. విద్యార్థుల యత్నాలు నిదానిస్తాయి. దూరప్రయాణాలు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

మీనం : పలుకుబడి పెరుగుతుంది. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

Related posts