telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : … పనులు వాయిదా… ఆరోగ్యం జాగర్త..

today rasi falalu

మేషం : కొత్త పనులు ప్రారంభిస్తారు. బంధువుల ద్వారా శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. ఇంటర్వ్యూలందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

వృషభం : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. కుటుంబసభ్యులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మిథునం : ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో కొద్దిపాటి వివాదాలు. ఉద్యోగ, వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి.

కర్కాటకం : పనులలో కొంత జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. విద్యార్థులకు అసంతృప్తి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

సింహం : పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం.

కన్య : ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వాహన, గృహయోగాలు. శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. ఇంటాబయటా ప్రోత్సాహకరం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల : వ్యవహారాలలో అవరోధాలు. ధనవ్యయం. కుటుంబ సభ్యులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు.

వృశ్చికం : బంధువులతో కొద్దిపాటి విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో తొందరపాటు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

ధనుస్సు : నూతన పరిచయాలు. సంఘంలో విశేష ఆదరణ. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. దైవచింతన.

మకరం : ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడుడులు. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఉద్యోగ, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు. విద్యార్థులకు నిరుత్సాహం.

కుంభం : చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వస్తులాభాలు. ఉద్యోగ, వ్యాపారాలలో మరింత అభివృద్ధి కనిపిస్తుంది.

మీనం : మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. ఉద్యోగ యత్నాలు ముందుకు సాగవు.

Related posts