telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : … ఆకస్మిక ప్రయాణాలు .. వ్యాపారవృద్ధి..

today rasi falalu

మేషం : ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

వృషభం : కొత్త విషయాలు తెలుస్తాయి. భూములు, వాహనాలు కొంటారు. ఆర్థిక ప్రగతి. పనులు చకచకా సాగుతాయి. నూతన పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మిథునం : సన్నిహితులతో సఖ్యత. కొన్ని సమస్యలు తీరతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. పనుల్లో విజయం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సంతృప్తికరంగా ఉంటాయి.

కర్కాటకం : అనుకున్న పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత పురోగతి.

సింహం : సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కన్య : సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

తుల : మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ముఖ్య వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

వృశ్చికం : సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. పోటీపరీక్షల్లో విజయం. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో విజయాలు సాధిస్తారు.

ధనుస్సు : పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

మకరం : సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయ దర్శనాలు. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

కుంభం : మిత్రుల నుంచి ఆహ్వానాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహన, గృహయోగాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మీనం : సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి ఒత్తిడులు. పనులు వాయిదా వేస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

Related posts