telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : … కుటుంబ సహకారం … ఆర్థిక లాభం..

today rasi falalu

మేషం : ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకం గా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.

వృషభం : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ ప్రయాణాలు కాని చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బుకానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

మిథునం : ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.

కర్కాటకం : ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక విషయాలు అనుకూలించవు.

సింహం : ఈ రోజు మీరు దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్యసమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గరవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్రదర్శనం చేసుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి

కన్య : ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి.

తుల : ఈ రోజు మీ వృత్తికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్త్ర, వస్తులాభం కలుగుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చికం : ఈ రోజు గృహ సంబంధ వ్యవహారాల్లో తీరిక లేకుండా గడుపుతారు. మీ జీవితభాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్య సంబంధ వ్యవహారాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉన్నప్పటికి, సమయానికి డబ్బు అందుతుంది. తగినంత విశ్రాంతి అవసరం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది

ధనుస్సు : ఈ రోజు మానసికంగా తెలియని ఆందోళనకు, ఒత్తిడికి లోనవుతారు. ఉద్యోగ విషయంలో అనుకోని ఆటంకాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. మీ సంతానం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల కారణంగా కొంత ఓదార్పు లభిస్తుంది.

మకరం : ఈ రోజు వృత్తిలో అనుకోని మార్పులు ఉంటాయి. అదనపు బాధ్యతలు చేపట్టడం కానీ, అదనపు సమయం పని చేయాల్సిరావటం కానీ జరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కడుపు, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు.

కుంభం : ఈ రోజు మీ ఉత్సాహాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. దాని కారణంగా మీ సహోద్యోగులతో లేదా, చుట్టుపక్కల వారితో సమస్యలు ఎదుర్కొంటారు. అనాలోచితమైన పనులు చేయకండి. ఉద్యోగంలో మార్పు కాని, ప్రయాణం చేయాల్సి రావటం కాని జరుగుతుంది. స్త్రీల కారణంగా సమస్యలనుంచి బయటపడ గలుగుతారు.

మీనం : ఈ రోజు మీ మాటను, ప్రవర్తనను కొంత అదుపులో ఉంచుకోవటం మంచిది. స్త్రీల కారణంగా అనవసర వివాదాల్లో ఇరుక్కునే అవకాశముంటుంది. గొడవల్లో తలదూర్చకండి. మీ మర్యాదకు భంగం వాటిల్లవచ్చు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు లాభిస్తాయి. మీ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు.

Related posts